Simran hit Back Female Co-Star: అలాంటి పాత్రల కంటే ఆంటీ రోల్స్ ఉత్తమం – జ్యోతికకు సిమ్రాన్ కౌంటర్!

Actress Simran Counter to Jyothika:సీనియర్ నటి సిమ్రాన్ ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు హీరోయిన్ నార్త్, సౌత్‌లో రాణించిన ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె అతిథి పాత్రలతో పాటు అమ్మ పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆమె శబ్దం అనే సినిమాలో నటించారు. ఇప్పుడు ఆమె నటించిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ త్వరలో విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.
ఆంటీ రోల్స్ కంటే ఇది బెటర్
ఇదిలా ఉంటే రీసెంట్‌గా సిమ్రాన్ ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. “కొద్దిరోజులు క్రితం నాతో నటించిన కో-స్టార్‌కి ఓ మెసేజ్ పంపాను. ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి చెప్పాను. ఆ పాత్రలో మిమ్మల్ని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఆపై మీ పాత్ర చాలా బాగుందని చెప్పాను. దానికి ఆమె నుంచి నాకు వెంటనే ఓ రిప్లై వచ్చింది. అది చదివి నేను షాక్ అయ్యాను. ‘ఆంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇలాంటి పాత్రలు చాలా బెటర్ కదా’ అని సమాధానం వచ్చింది.
ఆ నటికి సిమ్రాన్ కౌంటర్
నేను మంచి ఉద్దేశంతోనే ఆ మెసేజ్ పంపాను. కానీ, ఆమె నుంచి అలాంటి సమాధానం ఊహించలేదు. తన పాత్ర నచ్చి నా వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పాను. కానీ తను ఎంతో చులకనగా మాట్లాడినట్టు అనిపించింది. అయితే ఇప్పుడు ఈ వేదికగా నేను ఆ నటికి నా సమాధానం చెబుతున్నా. పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే.. ఆంటీ, అమ్మమ్మ పాత్రల్లో నటించడం చాలా ఉత్తమం. దేనిని చులకనగా చూడకూడదు” అని సిమ్రాన్ సదరు నటికి కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జ్యోతికా? లైలా?
కాగా సిమ్రాన్ మాటల ప్రకారం చూస్తే ఆమె చెప్పింది నటి, హీరో సూర్య భార్య జ్యోతిక గురించే అయ్యింటుందని సందేహిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల జ్యోతిక ‘డబ్బా కార్టెల్’ అనే సినిమాలో నటించింది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సినిమాలో జ్యోతిక లీడ్ రోల్ పోషించింది. ఇక్కడ సిమ్రాన్ డాబ్బా రోల్స్ అని అసహనంతో నొక్కి మరి చెప్పింది. దీంతో తను జ్యోతిక అనే ఆమె సినిమా పేరుతో సిమ్రాన్ హింట్ ఇచ్చిందని అంతా అభిప్రాయపడుతున్నారు. మరి కొందరేమో ఆమె చెప్పింది నటి లైలా గురించి అని అంటున్నారు.
సిమ్రాన్ నటించిన లేటెస్ట్ మూవీ శబ్ధంలో లైలా కూడా ముఖ్యపాత్రలో కనిపించారు. ఈ సినిమాలోనే ఆమె పాత్రను ఉద్దేశించే సిమ్రాన్ తనకి మెసేజ్ పంపారు. ఆది పనిశెట్టి హీరోగా హారర్ ఎలిమెంట్‌గా వచ్చిన ఈ సినిమాలో డాక్టర్ డయానా పాత్రలో సిమ్రాన్ నటించగా.. నాన్ఈస డేనియల్‌గా లైలా నెగిటివ్ షేడ్‌లో కనిపించారు. దీంతో ఈ కామెంట్స్ జ్యోతికా? లైలా? చేసిందా? అనేది క్లారిటీ రావడం లేదు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే వారి రీకౌంటర్ వచ్చే వరకు వేయిట్ చేయాల్సిందే.
Laila ? #Sabdham
— Christopher Kanagaraj (@Chrissuccess) April 20, 2025