Last Updated:

Nag Ashwin: విజయ్ దేవరకొండ – నాని ఫ్యాన్ వార్స్.. నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే.. ?

Nag Ashwin: విజయ్ దేవరకొండ – నాని ఫ్యాన్ వార్స్.. నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే.. ?

Nag Ashwin: గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో న్యాచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరూ కలిసి నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమా 10 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా మార్చి 21 న రీరిలీజ్ కానుంది. కల్కి, మహానటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. 2015 లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

 

ఇక ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ టైమ్ కు నాని ఒక స్టార్ హీరో. విజయ్ అప్ కమింగ్ హీరో. కానీ పదేళ్ల తరువాత ఇద్దరూ ఎదిగారు. స్టార్ హీరో నాని కాస్తా న్యాచురల్ స్టార్, హిట్ ప్రొడ్యూసర్ గా మారదు.  విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. పదేళ్ల తరువాత ఎవడే సుబ్రమణ్యం రీ-రిలీజ్ సందర్భంగా ఇరు వర్గాల అభిమానుల మధ్య వాగ్వాదాలు తలెత్తాయి.

 

కొందరు నాని అభిమానులు విజయ్‌కి కెరీర్ పరంగా  మా హీరో సహాయం చేశాడని, ఎవడే సుబ్రమణ్యం ద్వారా విజయ్‌కి గుర్తింపు వచ్చిందని వాదిస్తుంటే, విజయ్ అభిమానులు తన సొంత టాలెంట్‌తో అర్జున్ రెడ్డి వంటి చిత్రాల ద్వారా స్టార్‌డమ్ సాధించాడని చెప్పుకొస్తున్నారు. ఈ వివాదం మరింత జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఒక యూట్యూబర్ నాని, విజయ్‌పై నెగెటివ్ పీఆర్ క్యాంపైన్ నడిపిస్తున్నాడని ఆరోపించడం ఈ గొడవకు మరింత ఆజ్యం పోసింది.

 

అలా నాని – విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కొట్టుకుంటున్న సమయంలో ఎవడే సుబ్రహ్మణ్యం టీమ్ కోసం వైజయంతీ మూవీస్ ఒక పార్టీని ఏర్పాటుచేసింది. ఆ పార్టీలో నాని- విజయ్ ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం జరిగింది. ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. వారు వారు బాగానే ఉన్నారు. మీరు కూడా మారాలి అని నెటిజన్స్ ఫ్యాన్స్ కు చురకలు కూడా పెట్టారు.

 

ఇక ఇప్పుడిప్పుడే ఈ ఫ్యాన్ వార్స్ చల్లబడుతున్ననేపథ్యంలో తాజాగా నాగ్ అశ్విన్ ప్రెస్ మీట్ పెట్టడం, అందులో నాని – విజయ్ ల ఫ్యాన్ వార్స్ గురించి ప్రశ్నలు అడగడం జరిగాయి. ఆ ప్రశ్నలకు సమాధానంగా నాగీ మాట్లాడుతూ.. ” నానికి విజయ్ కు ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయని అంతగా తెలీదు. బిగినింగ్ లో నాని.. విజయ్ కు చాలా సపోర్ట్ ఉండేవాడు. ప్రతి సీన్ వాళ్లిద్దరూ డిస్కస్ చేసుకొని.. విజయ్ సీన్, నాని సీన్ అయినా కూడా ఇద్దరూ కలిసే మాట్లాడుకునేవారు. ఇద్దరు చాలా మంచి వ్యక్తులు. ఇద్దరూ కూడా లక్ష్యం ఉన్నవారు. ఇప్పుడు ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం  ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి: