Puri- Sethupathi: టాలెంటెడ్ హీరోయిన్ ను దింపుతున్న పూరి.. ఈసారి వర్క్ అవుట్ అయ్యేలా ఉందే..?

Puri- Sethupathi: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. లైగర్ ఇచ్చిన డిజాస్టర్ నుంచి బయటపడడానికి డబుల్ ఇస్మార్ట్ అంటూ వచ్చాడు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా పూరికి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో ఇండస్ట్రీలో పూరి పని అయ్యిపోయిందని, సినిమాలు తీయడం మానేయాలంటూ కామెంట్స్. వచ్చాయి. అయినా పూరి ఇవేమి పట్టించుకోకుండా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు.
ఇక ఈ మధ్యనే పూరి.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రానికి పూరి, ఛార్మీ నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. అసలు వీరి కాంబోలో ఒక సినిమా వస్తుంది అంటేనే ప్రేక్షకులు షాక్ అయ్యారు. దానికి కారణం.. ప్రస్తుతం విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాంటి హీరోను ప్లాప్స్ మధ్య వున్న డైరెక్టర్ ఒక సినిమా కోసం ఒప్పించాడు అంటే.. ఆ కథలో ఎంత డెప్త్ ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
పూరి ఈసారి మాత్రం తన సత్తా మొత్తం చూపించాలని చూస్తున్నాడు. అందుకే సినిమాలో స్టార్స్ మొత్తం దింపుతున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ టబును తీసుకున్నారని టాక్ నడుస్తోంది. కూలీ అనే సినిమాతో టబు తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ.. ఆ తరువాత తెలుగులో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది.
కొన్నాళ్ల తరువాత హిందీకే పరిమితమయిన టబు.. అల వైకుంఠపురంలో సినిమాతో తెలుగుకు రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం హిందీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న టబు.. పూరి – సేతుపతి సినిమాలో కీలక పాత్రలో నటించనుందని వార్తలు వినపిస్తున్నాయి. కథలో ఈ పాత్ర చాలా కీలకమని, కథ చెప్పగానే టబు వెంటనే ఒప్పుకుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట.
ఇప్పటికే సేతుపతి హీరో అనగానే సినిమాపై ఒక హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఇందులో టబు కూడా ఎంటర్ అవ్వడంతో ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ హైప్ వచ్చేసింది. మరి ఈ సినిమాతో పూరి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.