Actor Vishal Health Update: హీరో విశాల్‌కు ఆస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. స్పందించిన టీం!

Actor Vishal Health Collapsed on Stage: హీరో విశాల్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆదివారం తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న విశాల్ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. దీంతో విశాల్‌కి ఏమైందని అభిమానులంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఆరోగ్యంపై విశాల్ టీం స్పందించింది. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వల్లే విశాల్ అస్వస్థతకు గురయ్యారని, ఆయనను ఆస్పత్రికి తరలించామన్నారు.
వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమిళనాడు విల్లుపురంలో ఉండే కువాగం గ్రామంలో ఉన్న ఆలయంలో కొద్దిరోజులుగా చిత్తిరై(తమిళమాసం) మాసం వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం మిస్ కువాగం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాంలో పాల్గొన్న విశాల్ కొద్దిసేపట్లోనే ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.