Last Updated:

Horoscope: నేటి రాశి ఫలాలు (05 నవంబర్ 2022)

ఈ రోజు అన్నిరాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. చాలా మంది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారస్థులకు లాభాలు లభిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.

Horoscope: నేటి రాశి ఫలాలు (05 నవంబర్ 2022)

Horoscope: ఈ రోజు అన్నిరాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. చాలా మంది ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారస్థులకు లాభాలు లభిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.

1.మేష రాశి
ఈ రోజు మీకు సరదాసరదాగా గడుస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత, మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది ఆరోగ్యం బాగానే బాగుంటుంది. ఈ రోజు మీకు లాభదాయకంగానే గడుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

2.వృషభ రాశి
అనవసరమైన టెన్షన్, వర్రీ మీ సంతోషజీవితాన్ని పాడుచేస్తుంది. దాన్ని వదిలించుకుంటే మీరు ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

3. మిథున రాశి
ఈ రోజు ప్రశాంతంగా- టెన్షన్ లేకుండా ఉండండి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్నిమరింత ఎత్తులో ఉంచుతారు. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటుంది.

4. కర్కాటక రాశి
మీ మనసును వేధిస్తున్న సమస్యలను ఈ రోజు పరిష్కరించగలరు. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

5. సింహ రాశి
ఈ రోజు మీరు రిలాక్స్ మూడ్ లో ఉంటారు. మీ ఆరోగ్యంగా ఉంటారు. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలుసుగా తీసుకోనివ్వకండి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

6. కన్యా రాశి
మీ వేగవంతమైన స్వభావం, మిమ్మల్ని లక్ష్యంవైపుకు నడిపిస్తుంది. విజయం దరిచేరాలంటే, కాలంతో పాటు, మీ ఆలోచనలను మార్చుకోండి. ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది.
ధ్యానం మరియు యోగా మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ఈ రోజు ధనలాభాన్ని పొందుతారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7. తులా రాశి
మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. మీ వృత్తి వ్యాపారాల్లో తగిన లాభాలు లభిస్తాయి. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.

8. వృశ్చిక రాశి
మిత్రులతో గడిపే సాయంత్రాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. మీ దయా స్వభావం ఈ రోజు మీకు సంతోషాన్ని ఇస్తుంది. పని ఒత్తిడిని తగ్గించడానికి యోగా,వ్యాయామం చేయాలిసి ఉంటుంది. మీ దగ్గర చెప్పుకోదగినంత ధనం ఉండక చాలా విచారంగా ఉంటారు. ఆఫీసులో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది.

9. ధనస్సు రాశి
మీ ఖాళీ సమయాన్ని కుటుంబంలో ఆనందంగా గడపడానికి ఇంటిని డెకరేట్ చెయ్యడానికి ఉపయోగించడం ద్వారా ప్రశంసలు పొందుతారు. స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది.

10. మకర రాశి
రియల్ ఎస్టేట్ లోపెట్టుబడులు అత్యధిక లాభదాయకం. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రేమ జీవితం కొంత కష్టతరం కావచ్చును. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది.

11. కుంభ రాశి
ఈ రోజు మీకు ఆర్ధిక సమస్యల నుండి ఉపశమనము కలిగుతుంది. తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు కొత్త స్నేహితులను పరిచయం చేస్తుంది. మీ మాటను అదుపుచేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి. కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

12. మీన రాశి
ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.

ఇదీ చదవండి: షిర్లీ సెటియా నోట.. “ఏముంది రా” పాట

ఇవి కూడా చదవండి: