Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉందని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే నవంబర్ 2 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉందని తెలుసా..!

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే నవంబర్ 2 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope)  ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి సహచరుల నుంచి సహాయ, సహకారాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి.

వృషభం..

ముఖ్యమైన పనులు సకాలంలో సునాయాసంగా పూర్తవుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా మారుతోంది. వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయంలో ఆశించిన మార్పు ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మిథునం..

వ్యాపారం లాభదాయకంగా సాగిపోతుంది. ఉద్యోగంలో కూడా ప్రాధాన్యం పెరుగుతుంది. ఆదాయంలో ఆశించినంతగా పెరుగుదల ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవా లేదు.

కర్కాటకం..

ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అనవసర వాగ్దానాలు చేయకపోవడం మంచిది. తల్లితండ్రుల ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

సింహం..

ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. విలాస జీవితం మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశముంది.

కన్య..

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండకపోవచ్చు. కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.

తుల..

ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఎటువంటి ప్రయత్నాలు తలపెట్టినా సఫలం అవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది.

వృశ్చికం..

ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక అవసరాలు, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టే సూచనలున్నాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

ధనస్సు..

ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి జీవితంలో ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుకుంటారు.

మకరం..

కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు కూడా సానుకూల పడతాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో గుర్తింపుతో పాటు డిమాండ్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కుంభం..

ఉద్యోగంలో ఆనిర్దేశించిన లక్ష్యా లను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి.

మీనం..

ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు యథావిధిగా కొనసాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.