Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని తెలుసా..!
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 30న రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిదని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 30న రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
మేషం..
మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగి పోతాయి. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభ సాటిగా కొనసాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
వృషభం..
గృహ నిర్మాణ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సతీమణికి కెరీర్ లో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
మిథునం..
వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. తలపెట్టిన పనులన్నిటినీ పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.
కర్కాటకం..
అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. బంధువుల రాకపోకలుంటాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
సింహం..
ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యు లతో సఖ్యత పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగి పోతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
కన్య..
ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ జీవి తం సాఫీగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువు లపై శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
తుల..
మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగి పోతాయి. వ్యాపారంలో బాగా బిజీ అవుతారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందు తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు.
వృశ్చికం..
వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగాల్లో మంచి అవకా శాలు అందివస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి.రాజకీయ నేతలతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు మామూలుగా సాగిపో తాయి.
ధనస్సు..
నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం..
వృత్తి, ఉద్యోగాల పరంగా ఆశించిన శుభ వార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ప్రయ త్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో పలుకుబడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపా రాల్లో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
కుంభం..
వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సమస్యలకు దారి తీస్తాయి.
మీనం..
వృత్తి ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొత్త ప్రయత్నాల వల్ల ఆశించిన స్థాయిలో ఉపయోగం ఉంటుంది. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. దైవ చింతన పెరుగు తుంది. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.