Last Updated:

Fake Food Inspector: హైదరాబాద్‌ పోలీసుల అదుపులో నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్

భాగ్యనగరంలో ఓ నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ భాగోతం బయటపడింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పలు హోటళ్ల యజమానుల నుండి నెలసరి మామూళ్లను నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ వసూలు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు గుర్తించారు.

Fake Food Inspector: హైదరాబాద్‌ పోలీసుల అదుపులో నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్

Hyderabad: భాగ్యనగరంలో ఓ నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ భాగోతం బయటపడింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పలు హోటళ్ల యజమానుల నుండి నెలసరి మామూళ్లను నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ వసూలు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు గుర్తించారు.

పోలీసుల సమాచారం మేరకు, గత కొంత కాలంగా ఓ వ్యక్తి ఫుడ్ ఇన్స్ పెక్టర్ పేరుతో మాదాపూర్ లోని పలు హోటళ్ల యజమానుల నుండి నగదు వసూలు చేస్తున్నాడు. ఓ హోటల్ యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ ను అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు.

సైబరాబాద్ పరిధిలో పలు హోటళ్ల యజమానులను మోసం చేసిన్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ నిందుతుడి వద్ద ఏపీకి చెందిన న్యాయశాఖ ఉద్యోగి నారాయణ రావు పేరిట ఓ ఐడీ కూడా పోలీసులకు లభ్యమైంది. దీంతో లోతుగా విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Chain Snaching: సికింద్రాబాద్ లో చైన్ స్నాచింగ్…

ఇవి కూడా చదవండి: