Chain Snaching: సికింద్రాబాద్ లో చైన్ స్నాచింగ్…
భాగ్యనగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట దొంగతనాలు, మర్డర్లు కామన్ గా మారిపోయాయి. మరీ ముఖ్యంగా మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళనలు చెందుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సికింద్రాబాద్ లో ఓ ఘటన అద్దం పడుతుంది.
Secunderabad: భాగ్యనగరంలో నిత్యం ఎక్కడో ఓ చోట దొంగతనాలు, మర్డర్లు కామన్ గా మారిపోయాయి. మరీ ముఖ్యంగా మహిళలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళనలు చెందుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సికింద్రాబాద్ లో ఓ ఘటన అద్దం పడుతుంది.
సికింద్రాబాదులో గోపాలపురం పీఎస్ పరిధిలోని ఓ సిగ్నల్ వద్ద ఉదయం 10.40 నిమిషాలకు ఇద్దరు మహిళలు రోడ్డు దాటేందుకు ఓ వైపుగా నిల్చొని వున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వారి వైపుగా నడుస్తూ వచ్చి, హఠాత్తుగా ఓ మహిళ మెడలోని గొలుసును లాక్కొని అక్కడ నుండి పరుగులు తీశాడు. ఇది గమనించిన ఓ పోలీసు కానిస్టేబుల్, స్థానికులు చైన్ స్నాచర్ ను పట్టుకొనే ప్రయత్నం చేశారు. చివరికి వారి చేతికి చిక్కాడు. ఇవన్నీ సిసి కెమరాల్లో రికార్డు కూడా అయ్యాయి.
బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని మహిళలకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు పట్టుబడ్డ నిందితుడు ఎక్కడెక్కడ దొంగతనాలు చేసాడన్న కోణంలో విచారణ ప్రారంభించారు.
నగరంలో లక్ష సీసీ కెమరాలతో పోలీసులు తమ డేగ కన్నులతో పహారా చేస్తున్నా, పలు ప్రాంతాల్లో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు మాత్రం ఆగడం లేదు. అత్యధికంగా పోలీసులు, వాహనాల తనిఖీలు చేస్తూ ఫైన్లు లాక్కొనేందులో మాత్రం సిన్సియర్ గా డ్యూటీ చేస్తుండం మాత్రం ప్రజలందరూ చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: Hawala cash: రూ.2.4కోట్ల హవాలా నగదు పట్టివేత