Road Accident: సిరిసిల్లలో స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 20 మంది విద్యార్ధులకు గాయాలు
Road Accident: సిరిసిల్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ పాఠశాలను చెందిన స్కూల్ బస్సును.. ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 20మంది విద్యార్ధులకు తీవ్రగాయలవ్వగా.. బస్సులో ఉన్న మరో పది మందికి సైతం గాయపడ్డారు.
Road Accident: సిరిసిల్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ పాఠశాలను చెందిన స్కూల్ బస్సును.. ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీ కొట్టింది.
ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 20మంది విద్యార్ధులకు తీవ్రగాయలవ్వగా.. బస్సులో ఉన్న మరో పది మంది సైతం గాయపడ్డారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రముఖ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది.
20 మంది విద్యార్ధులకు గాయాలు
ఈ ప్రమాదంలో పలువురు విద్యార్ధులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో.. విద్యార్ధులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
ఏం చేయాలో అర్థం కాకా.. బిగ్గరగా ఏడుస్తూ.. హాహాకారాలు చేశారు.
ప్రమాద విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు.. స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ ఘటనలో చిన్నారులకు స్వల్పగాయలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సును కరీంనగర్ డీపోకు చెందినదిగా గుర్తించారు.
ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?.. లేదా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ బస్సులో ప్రయాణిస్తున్న పదిమందికి పైగా గాయలయ్యాయి.
ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్
రోడ్డు ప్రమాద ఘటనపై కేటీఆర్ స్పందించారు. ఈ ప్రమాదంపై కేటీఆర్ ( Minister KTR) ఆరా తీశారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో మాట్లాడి విద్యార్ధుల పరిస్థితి తెలుసుకున్నారు.
గాయపడిన విద్యార్థులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని కేటీఆర్ సూచించారు.
ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఘటన అనంతరం గాయాలతో తల్లడిల్లిన విద్యార్ధులు.
ఈ రోడ్డు ప్రమాదంపై స్పందించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి.
విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు.
అవసరమైతే విద్యార్ధులను హైదరాబాద్ తరలించే అవకాశం.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/