Last Updated:

Minister KTR: దమ్ముంటే పార్లమెంట్ ను రద్దు చేయండి.. మేమూ ముందస్తు ఎన్నికలకు రెడీ : మంత్రి కేటీఆర్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ను రద్దు చేసి వస్తే.. ముందుస్తు ఎన్నికలకు మేము కూడా రెడీ అని తెలిపారు.

Minister KTR: దమ్ముంటే పార్లమెంట్ ను రద్దు చేయండి.. మేమూ ముందస్తు ఎన్నికలకు రెడీ : మంత్రి కేటీఆర్

Minister KTR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ను రద్దు చేసి వస్తే.. ముందుస్తు ఎన్నికలకు మేము కూడా రెడీ అని తెలిపారు.

ముందస్తు ఎన్నికలకు వచ్చే దమ్ము బీజేపీకి ఉందా అని అన్నారు. ‘మీరు పార్లమెంట్ ను రద్దు చేసి రండి.. మేం అసెంబ్లీని రద్దు చేసి వస్తాం.. ప్రజల వద్దే ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం’ అని

కేటీఆర్ (Minister KTR) సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

బీజేపీది సబ్ కుచ్ బక్వాస్(Minister KTR)

తెలంగాణ పై కేంద్రం కక్ష కట్టిందని, మనం రూపాయి ఇస్తే, కేంద్రం 46 పైసలే ఇస్తోందని ఆయన మండిపడ్డారు. తాను చెప్పిన లెక్క తప్పైతే రాజీనామా కు సిద్ధమన్నారు.

నిజామాబాద్ ఎంపీ కేంద్రం నుంచి ఏం తెచ్చారని ప్రశ్నించారు. జిల్లాకు పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పి జూట్ బోర్డు కూడా ఎత్తేశారు.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ఒక్కక విద్యాసంస్థనైనా ఇచ్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

బీజేపీ ప్రభుత్వం పెట్టబోయే ఈ చివరి బడ్జెట్ లో అయినా రాష్ట్రం గురించి పట్టుంచుకోవాలన్నారు. కేంద్రం తీరు ఆకాశానికి అప్పులు , పాతాళానికి రూపాయి అన్న చందంగా ఉందన్నారు.

బీజేపీ వాళ్ల మాటలు చూస్తే సబ్ కా వికాస్.. చేతలేమో సబ్ కుచ్ బక్వాస్ అని విమర్శించారు. బీజేపీ నేతలు మోదీని దేవుడు అంటున్నారు.. ఎవరికి దేవుడు అని ప్రశ్నించారు.

కర్టాటక, మహారాష్ట్ర కొట్లాటను ఆపలేని వ్యక్తి.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపారట అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

సెంటిమెంట్ ను రిపీట్ చేస్తారా?

కాగా, గత కొంత కాలంగా బీఆర్ఎస్ , బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.

మరో వైపు తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు అనే ప్రచారం కొనసాగుతోంది. దానికి తోడు ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ముందస్తు ఎన్నికలపై బలాన్ని చేకూర్చాయి.

అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లబోతున్నామని కేటీఆర్ పరోక్షంగా సిగ్నల్ ఇచ్చారా అనే ప్రచారం ఊపందుకుంది.

ఇదిలా ఉంటే గత ఎన్నికల్లతో కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అధికారం చేజిక్కించుకుంది.

అదేవిధంగా ఈ సారి అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తారో చూడాలి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/