McDonald : రెస్టారెంట్లను రెట్టింపు చేసే దిశగా సాగుతున్న మెక్ డొనాల్డ్స్
క్విక్ సర్వీస్ రెస్టారెంట్ మెక్‌డొనాల్డ్స్ ఇండియా రాబోయే మూడేళ్లలో భారత్ లోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఈ ప్రాంతంలోని 300 రెస్టారెంట్‌లను దాటేందుకు తమ అవుట్‌లెట్‌లను రెట్టింపు చేయనున్నట్లు తెలిపింది
McDonald : క్విక్ సర్వీస్ రెస్టారెంట్ మెక్‌డొనాల్డ్స్ ఇండియా రాబోయే మూడేళ్లలో భారత్ లోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఈ ప్రాంతంలోని 300 రెస్టారెంట్‌లను దాటేందుకు తమ అవుట్‌లెట్‌లను రెట్టింపు చేయనున్నట్లు తెలిపింది. వ్యాపార విస్తరణలో భాగగా సోమవారం నాడు గౌహతిలో భారతదేశంలో అతిపెద్ద రెస్టారెంట్‌ను ప్రారంభించింది, ఇది 6,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 220 మందికి ఆహారం అందించగలదు.
మెక్‌డొనాల్డ్స్ ఇండియా (నార్త్ అండ్ ఈస్ట్) మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ రంజన్ మాట్లాడుతూ కంపెనీ వేగంగా వృద్ధి బాటలో పయనిస్తోందని, దాని కింద ఉన్న రాష్ట్రాలలో నెట్‌వర్క్‌ని విస్తరించాలని చూస్తున్నట్లు తెలిపారు.మెక్ డొనాల్డ్ ఎంఎంజి గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ అగర్వాల్‌ను ఉత్తర మరియు తూర్పు భారతదేశంలో అవుట్‌లెట్లను నిర్వహించడానికి తన కొత్త భాగస్వామిగా ఎంపిక చేసింది. మరోవైపు విడిపోయిన భాగస్వామి విక్రమ్ బక్షి నుండి 50 శాతం వాటాను కొనుగోలు చేసింది.
కంపెనీ ప్రస్తుతం ఉత్తర మరియు తూర్పు భారతదేశంలో 156 రెస్టారెంట్లను నిర్వహిస్తోందని, రాబోయే మూడేళ్లలో అవుట్‌లెట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని చూస్తున్నట్లు రంజన్ చెప్పారు. “మా రోల్స్‌లో ప్రస్తుతం 5,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. మేము విస్తరిస్తున్న కొద్దీ మేము నిరంతరంగా వ్యక్తులను తీసుకుంటాము. ఉద్యోగుల సంఖ్య మూడేళ్లలో రెట్టింపు అవుతుందని అన్నారు.గౌహతిలోని కొత్త అవుట్‌లెట్ ఉత్తర మరియు తూర్పు భారత ప్రాంతంలో మెక్‌డొనాల్డ్ యొక్క అతిపెద్ద రెస్టారెంట్ అని అన్నారు.