Last Updated:

Police Constable: పోలీస్ కానిస్టేబుల్ కటాఫ్ మార్కులు తగ్గింపు

పోలీసు ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పోలీసుల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష నిర్వహించిన సంగతి విదితమే. కాగా పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. కటాఫ్‌ మార్కులను తగ్గించింది.

Police Constable: పోలీస్ కానిస్టేబుల్ కటాఫ్ మార్కులు తగ్గింపు

Police Constable: పోలీసు ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పోలీసుల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష నిర్వహించిన సంగతి విదితమే. కాగా పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. కటాఫ్‌ మార్కులను తగ్గించింది.

కటాఫ్‌ మార్కులపై జీవోను సవరిస్తూ తెలంగాణ పోలీస్‌ నియామక మండలి ఉత్తర్వులు జారీ చేసింది. ఓసీ అభ్యర్థులకు 30శాతం, బీసీ అభ్యర్థులకు 25శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 20శాతం మార్కులను కటాఫ్ గా కేటాయిస్తున్నట్టు తన అధికారిక వెబ్‌సైట్‌లో నోటీసు ద్వారా వెల్లడించింది. అంటే దీని ప్రకారం 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 60 మార్కులు, బీసీ అభ్యర్థులకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 40 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించిన వారు అవుతారు.

ఇకపోతే ఇదివరకు ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్‌ మార్కులు 30 శాతంగా, బీసీలకు 35 శాతంగా, ఓసీలకు 40 శాతంగా ఉండేవి. కానీ, తాజాగా విడుదలైన ఉత్తర్వుల ప్రకారం ఈసారి సామాజికవర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30 శాతం మార్కులను అర్హతగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదీ చదవండి: రూ. 15వేలకే జియో ల్యాప్ టాప్..!

ఇవి కూడా చదవండి: