Home / బ్రేకింగ్ న్యూస్
ఉబ్జెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో రేపటి నుంచి జరగనున్న ఎస్సీఓ సమ్మిట్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయలుదేరి వెళ్లనున్నారు. సమర్ఖండ్లో ప్రధాని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు ఇతర దేశాల నాయకులతో భేటీ అవుతారు.
లక్నోలోని దారుల్ ఉలూమ్ నదావతుల ఉలేమాలో ముస్లింలు నిర్వహించే సెమినార్ల పై యూపీ సర్కార్ సర్వే నిర్వహించింది. ఇక్కడ నిర్వహించే సెమినార్లకు ప్రభుత్వం అనుమతి లేదని స్పష్టం చేసింది. జిల్లా మైనార్టీ అధికారి సోనే కుమార్‌తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొనే అవకాశం ఉంది.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను ఆయన బెదిరిస్తున్నారని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. పదే పదే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.
తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు చెందినఒకే ఇంటి నంబర్ పై 532 ఓట్లు నమోదయ్యాయి. ఆర్టీఐ చట్టం కింద ఖమ్మం కలెక్టరేట్ నుంచి కార్యకర్త కొయ్యిని వెంకన్న ఈ మేరకు వివరాలు సేకరించారు. మమత హాస్పిటల్ రోడ్డులోని గొల్లగూడెం ఏరియాలో 5-7-200 నంబర్ వున్న ఇంట్లో ఈ ఓట్లు నమోదయ్యాయి. Over 530 voters listed on minister Ajay Kumar's house number.
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ మొదలుపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశంలో సర్వత్రా 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు
కెనడాలోని స్వామినారాయణ్ ఆలయాన్ని ధ్వంసం చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా ఆ ఆలయం పై రాతలు రాశారు. కెనడాకు చెందిన ఖలిస్తానీ తీవ్రవాదులు ఆ పనిచేసి ఉంటారని భావిస్తున్నారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన ఆగంతకులపై చర్యలు తీసుకోవాలని భారత హై కమిషన్ ఓ ట్వీట్లో కోరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. ఈ క్రమంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కోవిడ్‌లో ఒమిక్రాన్ బీఏ.4.6 అనే కొత్త వేరియంట్ అమెరికా, బ్రిటన్లతో సహా పలు దేశాల్లో విస్తరిస్తోంది.
ఏపీ రాజధాని పనులు 40శాతం పూర్తి అయ్యాయని, అసెంబ్లీ ఎక్కడ ఉంటే ఆ ప్రాంతమే రాజధానిగా చూడాలని, ప్రస్తుత ఏపీ రాజధాని సంక్షోభానికి ముఖ్యమంత్రి జగన్ కారణమని కేంద్ర మంత్రి నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.