Asaduddin Owaisi: జైపూర్ లో ఓవైసి రోడ్ షో
దేశంలో సర్వత్రా 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు
Jaipur: దేశంలో సర్వత్రా 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. వచ్చే ఏడాది రాజస్ధాన్ లో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ఒవైసీ తన పర్యటనలో ప్రధాని మోదీ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
ప్రధాని మోదీ చిరుతకన్నా వేగంగా పరుగెత్తగలరని అంటూనే సమస్యల పై ఎదురయ్యే ప్రశ్నల నుండి అదే వేగంలో తప్పించుకుంటారని ఎద్దేవా చేశారు. ఆఫ్రీకా దేశం నమీబియా నుండి వచ్చిన చిరుతల నడుమ ప్రధాని మోడీ తన పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్న నేపధ్యంలో ఒవైసీ చిరుతల స్పీడుతో ప్రధాని అంటూ మాట్లాడారు.
ప్రజలు ఎప్పుడైనా మోడీని నిరుద్యోగం, లేక భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరల పై అడిగి చూడండి, ఆయన చిరుత కంటే వేగంగా పరుగు తీస్తారు. ఆయనను మేం ఆగమని చెబుతున్నాం. అడిగే ప్రశ్నలకు నిలిచి జవాబు ఇవ్వమంటున్నాం అని ఒవైసీ స్తుతిమెత్తంగా డిమాండ్ చేశారు. భారత భూభాగం పై చైనా ఎలా దురాక్రమణలకు పాల్పడుతోందో చెప్పమంటున్నాం అని ఒవైసీ అడిగారు. హాస్యం కూడా రాజకీయాల్లో భాగమేనని ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పారని, అందుకే ఆయన పై చిరుతపులి వ్యాఖ్యలు సరదాగా చేశానన్న ఒవైసీ, ప్రధాని మాటలు ప్రధానికే ఒప్పచెప్పారు.