Last Updated:

Gali Janardhan Reddy: గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను ఆయన బెదిరిస్తున్నారని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. పదే పదే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.

Gali Janardhan Reddy: గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్

New Delhi: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను ఆయన బెదిరిస్తున్నారని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. పదే పదే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది.

గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో గాలిజనార్దన్ రెడ్డి పై సిబిఐ నమోదు చేసిన కేసుల విచారణలో జాప్యం పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ పన్నెండేళ్లుగా జాప్యం కావడాన్ని సహించలేమని వ్యాఖ్యానించింది. తాము గతంలో ఆదేశించినా విచారణలో జాప్యం ఎందుకు జరిగింది. విచారణ ఏ దశలో ఉందో? చెప్పాలంది. ఏ కారణాల చేత విచారణ ముందుకు సాగడం లేదో సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని కోర్టు బుధవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20కి ధర్మాసనం వాయిదా వేసింది.

గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మంది పై సిబిఐ 2009లో కేసులు నమోదు చేసింది. 2011 సెప్టెంబర్ 5న గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. కర్ణాటకలోని బళ్ళారి, ఆంధ్రప్రదేశ్లోని కడప, అనంతపూర్ జిల్లాలకు వెళ్ళొద్దని షరతులతో సుప్రీంకోర్టు 2015 జనవరి 20న ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

ఇవి కూడా చదవండి: