Kona Raghupathi: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొనే అవకాశం ఉంది.

Amaravati: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. సోమవారం నాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకొనే అవకాశం ఉంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ సామాజిక సమీకరణాల నేపథ్యంలో నామినేటేడ్ పదవుల్లో మార్పులు చేర్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామాను సమర్పించారు. దీంతో ఈ స్థానంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి ఈ పదవిని కట్టబెట్టాలని వైసీపీ నాయకత్వం భావిస్తోందని సమాచారం.