Home / బ్రేకింగ్ న్యూస్
ప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాల్లో భాగంగా మహిళల బైక్ ర్యాలీ చేపట్టారు.ఇందులో భాగంగా సిటీలో వందలాది మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ ప్రారంభించారు
కేంద్ర కాఫీ బోర్డు సభ్యురాలిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి నియమితులయ్యారు. కాఫీ సాగు చేసే రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల విభాగంలో ఏపీ గిరిజన సంక్షేమ విభాగం కార్యదర్శి కాంతిలాల్ దండేకు స్థానం కల్పించారు.
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో ప్రాణం బలైపోంది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది ఈ ఘటన. నాయుడుపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేలవలి హరికృష్ణకు భార్య రజిత, కుమార్తె హరిణి ఉన్నారు.
కొడాలి నాని మాట్లాడే భాషలో తప్పులేదని ఆయన పై ఈగ వాలితే సహించేది లేదని మంత్రి రోజా హెచ్చరించారు. గురువారం ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ టీడీపీ నేతల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.
భారత స్టార్ రెజ్లర్, కామన్వెల్త్ 2022 స్వర్ణ పతక విజేత వినేశ్ ఫొగాట్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ తరపున రెండు కాంస్యాలు నెగ్గిన తొలి రెజ్లర్‌గా చరిత్రకెక్కింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు దళిత మైనర్ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు ఊరి చివర చెట్టుకు వేలాడుతూ అనుమానాస్పద రీతిలో కనిపించాయి.
రాబిన్ ఊతప్ప క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తొలి టీ20 ప్రపంచకప్ హీరోగా రికార్డుకెక్కిన ఊతప్ప.. టీ20 ప్రపంచకప్‌లో తొలి బౌలౌట్‌లో భారత్‌ను గెలిపించాడు. కాగా ఈ బౌలర్ బుధవారం క్రికెట్ యొక్క అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.
ఉద్యోగాల భర్తీని డిమాండ్ చేస్తూ తెదేపా నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. కాగా వెలగపూడి చెక్ పోస్ట్ వద్ద వారిని పోలీసులు అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులకు, తెదేపా నేతలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
హైదరాబాద్ లో ఏదో ఒక మూలన నిత్యం ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చి.. ఎన్ని శిక్షలు వేసినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. పసి పిల్లలని కూడా చూడకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. కాగా ఇలాంటి సంఘటనే తాజాగా పాతబస్తీలో వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నేడు ఉదయం 9 గంటలకు నుంచి అసెంబ్లీ ప్రారంభమవ్వనుంది. బీఏసీ సమావేశంలో సమావేశాలు ఎన్నిరోజులు జరగాలి. అసెంబ్లీలో చర్చిలించాలిసిన అంశాలను గురించి నిర్ణయం తీసుకోనున్నారు.