Home / బ్రేకింగ్ న్యూస్
దేశంలోనే మొట్టమొదటి ఐకానిక్ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నిర్మించనున్నారు. కృష్ణా నదిపై రూ.1,082.56 కోట్ల అంచనా వ్యయంతో 30 నెలల్లోనే ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిని పూర్తిచేసేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డురవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ట్విటర్ వేదికగా ప్రకటించారు.
భాగ్యనగరం జంట హత్యలతో మరోసారి ఉలిక్కిపడింది. ఈ ఘటన ఉప్పల్‌లో కలకలం రేపుతోంది. తండ్రికొడుకులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతే రాజధాని అన్న వారిని పొలిమేరల నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతం మరో అగ్ని గుండం కాబోతుందన్నారు.
2023లో జరగనున్న 10వ తరగతి పరిక్షల్లో 6 పేపర్లే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం పేర్కొనింది. విద్యాశాఖ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించింది.
తమిళ- తెలుగు అభిమానులుకు బిచ్చగాడు సినిమాతో అత్యంత చేరువైన హీరో విజయ్ ఆంటోనీ. కాగా ఈ నటుడు విడాకులకు సిద్ధమైనట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రభావంతో పలు ప్రాంతాలకు ముప్పు ఏర్పడింది. ఈ క్రమంలో అనంతపురం అధికారులు నగరానికి వరద ముప్పు పొంచి ఉంది అంటూ ప్రజలను మెసేజ్ రూపంలో హెచ్చరికలు చేశారు.
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాక్ లోని కరాచీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సు లో మంటలు చెలరేగి 21 మంది సజీవ దహనం అయ్యారు.
అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) త్వరలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే బౌలర్లను డిసైడ్ చేసింది. ఒక్కో జట్టులో అత్యంత ప్రమాదకరమైన స్ట్రైక్ బౌలర్లను ఎంపిక చేసింది. ఈ మెగా టోర్నీలో 16 జట్ల తలపడనుండగా.. ఒక్కో జట్టు నుంచి ఇద్దరు స్ట్రైక్ బౌలర్లను ఎంపిక చేస్తూ ఒక జాబితా విడుదల చేసింది. మరి వారెవరో చూసెయ్యండి.
సరోగసి ద్వారానే నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులయ్యారనే వార్తలు రావడంతో తీవ్ర దూమారం రేగింది. ఈ క్రమంలో తాజాగా విఘ్నేశ్ ఇన్‌స్టా స్టోరీస్‌లో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
5జీ సేవలను పలు మెట్రో నగరాల్లో జియో, ఎయిర్టెల్ వినియోగదారులకు అందిస్తున్నాయి. కాగా 4జీతో పోల్చితే 5జీ నెట్ స్పీడ్ పదింతలు ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలో 5G డౌన్లోడ్ స్పీడ్ అసలు ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఓక్లా ఓ టెస్ట్ చేసింది. ఈ టెస్టులో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.