Home / బ్రేకింగ్ న్యూస్
యావత్ ప్రపంచాన్ని కరోనా గడగడలాడించింది. కాగా ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటూ కరోనా మహమ్మారి కథ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో కరోనా కొత్త రూపం కలవరపాటుకు గురి చేస్తోంది.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకొనింది. కేదార్నాథ్ యాత్రికులను తీసుకెళ్లున్న ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నభారత్ జోడో యాత్ర మంగళవారంనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. నాలుగు రోజుల పాటు ఈ యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది.
భారత 50వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.
తన సొంత సొమ్ము వెచ్చించి 16 చెరువుల నిర్మాణానికి కృషి చేసి ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న కర్ణాటకకు చెందిన కామెగౌడ సోమవారం కన్నుమూశారు.
ఢిల్లీ మహిళా కమీషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు.
అధికార భాష పై పార్లమెంటరీ కమిటీ సమర్పించిన నివేదిక పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో (రీసెర్చ్ అండ్ రిఫరల్) కంటిశుక్లం ( కాటరాక్ట్) శస్త్రచికిత్స విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి తెలిపారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై విజిలెన్స్ విచారణకు సంబంధించి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) మన్మోహన్ కుమార్కు రూ. 50 లక్షలు లంచం ఇవ్వజూపిన పంజాబ్ మాజీ మంత్రి సుందర్ షామ్ అరోరా ను పంజాబ్ విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది.
దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు గుప్పించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కేసులో ప్రధాన నిందితుడుగా సీబీఐ నమోదు చేసిన వారిలో ఒకరైన ఢిల్లీ ఆప్ పార్టీ కీలక నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.