Home / బ్రేకింగ్ న్యూస్
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న అనగా సోమవారం ప్రధాన పార్టీలు అయిన తెరాస, భాజపా, కాంగ్రెస్ నేతులు నామినేషన్ వేసిన విషయం విదితమే. కాగా నామినేషన్లు వేసినరోజు రాత్రే చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించి ఉండడం కలకలం రేపుతుంది.
ఆర్థిక శాస్త్రాలలో ఈ సంవత్సరం నోబెల్ బహుమతి US ఫెడరల్ రిజర్వ్ మాజీ చైర్ బెన్ S. బెర్నాంకే మరియు ఇద్దరు U.S. ఆధారిత ఆర్థికవేత్తలు డగ్లస్ W. డైమండ్ మరియు ఫిలిప్ H. డైబ్విగ్లకు ప్రకటించారు.
కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తర భారతాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 9 మంది మృతిచెందారు.
రష్యా, ఉక్రెయిన్ దేశాల మద్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో మరో కీలకం చోటుచేసుకొనింది. గడిచిన 8 నెలలుగా సాగుతున్న యుద్దం నేపధ్యంలో నేడు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై భీకర బాంబు దాడులు చోటుచేసుకొన్నాయి. అత్యంత కీలక దాడులుగా ఉక్రెయిన్ దేశం ప్రకటించింది
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే అభిషేక్ రావు నివాసంలో ఈడీ, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు.
భారతీయ రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల కల్పననుగాను మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ నేడు క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించింది.
ఇప్పటికే వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతుంటే.. మరల ఈ నెల 14వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా పునః ప్రారంభం కానున్నాయి.
ఉద్ధవ్ ఠాక్రే మరియు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాల మధ్య ఎన్నికలగుర్తు వివాదం నేపధ్యంలో భారత ఎన్నికల సంఘం శనివారం శివసేన యొక్క విల్లు మరియు బాణం గుర్తును స్తంభింపజేసింది.