Last Updated:

Heavy Rains: కట్ట తెగిపోతుంది జాగ్రత్త.. అప్రమత్తం పై అనంతపురం అధికారుల మెసేజ్

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రభావంతో పలు ప్రాంతాలకు ముప్పు ఏర్పడింది. ఈ క్రమంలో అనంతపురం అధికారులు నగరానికి వరద ముప్పు పొంచి ఉంది అంటూ ప్రజలను మెసేజ్ రూపంలో హెచ్చరికలు చేశారు.

Heavy Rains: కట్ట తెగిపోతుంది జాగ్రత్త.. అప్రమత్తం పై అనంతపురం అధికారుల మెసేజ్

Anatapur: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రభావంతో పలు ప్రాంతాలకు ముప్పు ఏర్పడింది. ఈ క్రమంలో అనంతపురం అధికారులు నగరానికి వరద ముప్పు పొంచి ఉంది అంటూ ప్రజలను మెసేజ్ రూపంలో హెచ్చరికలు చేశారు.

భారీ వర్షాల కారణంగా నగరానికి ఎగువనున్న కట్నే కాలువ, కుక్కలపల్లి, ఆలమూరు చెరువులకు గండ్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో కాట్నేకాలువ చెరువు మరి కొద్ది సేపట్లో తెగిపోతుందంటూ అధికారులకు హెచ్చరికలు చేశారు. నీటి ప్రవాహం ఉధృతమవుతున్న క్రమంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్నప్తి చేశారు.

శివారు ప్రాంతాలు ఇప్పటికే వరద నీటితో అతాలాకుతలంగా మారాయి. కాలనీల్లోని ప్రజలు బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్నారు. విమలా ఫరూక్ నగర్, చంద్రబాబు నాయుడు కొట్టాల, విశ్వశాంతి కాలనీ, రజక కాలనీ, దండోరా కాలనీ, వికలాంగుల కాలనీ, బజాజ్ నగర్, ప్రశాంతి నగర్ కాలనీలకు ముప్పు పొంచి ఉంది.

ఇప్పటికే కర్నూలు నుండి రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ టీంలు అనంతపురంకు చేరుకొన్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు అప్రమత్తమైనాయి. కరువుకు కేరాఫ్ గా ఉన్న అనంతపురంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వానలు కురిశాయి. వరదలు రావడంతో ఈ పరిస్ధితి ఏర్పడింది. మరో వైపు ఆక్రమణల నేపధ్యంలో వర్షపు నీరు చెరువుల్లోకి వెళ్లేందుకు వీలులేక కొన్ని ప్రాంతాల్లోని నీరు రోడ్ల పైకి చేరి ప్రళయాన్ని తలపిస్తుంది.

బాధిత ప్రజలను సాయిబాబా ఆలయం, ప్రభుత్వ పాఠశాలలకు అధికారులు తరలించారు. తాత్కాలిక సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. పలు చోట్ల ప్రజలు ప్రభుత్వం పై తిరగబడుతున్నారు. నిత్యావసర వస్తువులు, బట్టలు, పాత్రలు, గృహోపకరణాలు అన్నీ పోగొట్టుకున్నామని నడుము లోతు నీరు ఇండ్లలోకి చేరడంతో పరిస్ధితి చిన్నాభిన్నంగా మారిందని ప్రజలు అక్రోశిస్తున్నారు.

ఇది కూడా చదవండి: పులివెందుల, కుప్పం ప్రాంతాలకు నీరెవరిచ్చారు? చెప్పండి సీఎం

ఇవి కూడా చదవండి: