Home / బ్రేకింగ్ న్యూస్
క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఇప్పటి వరకు క్రికెట్ మ్యాచ్‌లను మొబైల్ మరియు టీవీ స్క్రీన్లపై మాత్రమే చూసుంటారు కానీ థియేటర్లలోనూ క్రికెట్ చూస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా అయితే ఇది మీకోసమే. ఇకపై భారత జట్టు ఆడే అన్ని గ్రూప్ మ్యాచ్ లను ఐనాక్స్ లో చూడవచ్చు.
రోజూ వందల సంఖ్యలో రైల్వే సర్వీసులు రద్దవుతూనే ఉన్నాయి. కాగా తాజాగా మరో 168 ట్రైన్స్‌ను క్యాన్సల్ అయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 168 రైళ్లను రద్దుచేస్తున్నట్టు ఐఆర్సీటీసీ ప్రకటించింది.
బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ నిష్ర్కమణ తేదీ ఖరారయ్యింది. గత మూడేళ్లుగా భారత క్రికెట్ లో చక్రం తిప్పిన గంగూలీ పదవీకాలం ఈనెల 18తో ముగియనుంది. ఇకపోతే ఐసీసీ చైర్మన్ పదవి కూడా దాదాకు దాదాపుగా దూరం అయినట్లే తెలుస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిగొన్నాయి. ప్రారంభం నుండి ఊగిసలాడుతూ పలు కంపెనీలు ట్రేడింగ్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 843.79 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 257.45 పాయింట్లు నష్ట పోయింది
తెలంగాణా సర్కార్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంలో తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగట్టింది.
క్యాన్సర్ తో పోరాడుతున్న గుజరాత్ బాలనటుడు రాహుల్ (10) మృతి చెందాడు. గత కొన్ని రోజులు క్రితం రాహుల్ క్యాన్సర్ భారిన పడి నేడు తుది శ్వాస విడిచాడు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన బాలనటుడు రాహుల్ ఛెల్లో షో లో నటించాడు.
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెద్ద షాక్. . ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం టీఎంసీ ఎమ్మెల్యే, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా బోర్డు మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్యను టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించి అధికారికంగా అరెస్టు చేసింది.
మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సామాగ్రి దగ్దమైంది. ఉద్దేశ్యపూర్వకంగానే ఈప్రచార సామాగ్రిని దుండగులు దగ్ధం చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న అనగా సోమవారం ప్రధాన పార్టీలు అయిన తెరాస, భాజపా, కాంగ్రెస్ నేతులు నామినేషన్ వేసిన విషయం విదితమే. కాగా నామినేషన్లు వేసినరోజు రాత్రే చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించి ఉండడం కలకలం రేపుతుంది.