Home / బ్రేకింగ్ న్యూస్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు విశాఖ పోలీసులు 41ఏ నోటీసులిచ్చారు. పవన్ విశాఖలోనే ఉంటే శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదముందని నాలుగు గంటల్లో నగరం విడిచి వెళ్లిపోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రుల కార్లపై రాళ్ల దాడి కేసులో జనసేన నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు.
శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో పండ్ల తోటలకు వెళుతున్న పూరన్ క్రిషన్ అనే కాశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపినట్లు అధికారులు తెలిపారు.
గత కొద్దిరోజుల నుంచి తెలుగురాష్ట్రాల ప్రజలను ఎడతెరపిలేని వర్షాలు అల్లాడిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఏపీ రాజకీయాలు విశాఖ కేంద్రంగా ఉట్టుడుకుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ విశాఖ గర్జన ర్యాలీ నిర్వహిస్తుండగా మరోవైపు నేడు జనసేనాని విశాఖలో పర్యటించనున్నారు.
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అంటూ నేడు విశాఖ గర్జన కార్యక్రమానికి జేఏసీ శ్రీకారం చుట్టింది. మన విశాఖ-మన రాజధాని నినాదంతో అధికార వైసీపీ ఈ ర్యాలీని తలపెట్టింది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొననున్నారు.
ఇండియా సరిహద్దు భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్ ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూల్చివేశారు.
ఏపీలోని రాజమండ్రిలో రోడ్ కమ్ రైలు వంతెనపై నేటి నుంచి వారం రోజులపాటు రాకపోకలు అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. మరమ్మతుల కోసం వంతెనను మూసివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కేసు తేలేంతవరకు, రాష్ట్రంలో విద్యా సంస్ధల్లో హిజాబ్ ను విద్యార్దులు తొలగించాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ పేర్కొన్నారు.
హైదరాబాదులో మరోసారి ఐటీ శాఖ దాడులు కలకలం రేపుతున్నాయి. వస్త్ర వ్యాపారంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ అగ్రగామి సంస్థ అయిన ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయాలు, నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.