Pakistan: ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది సజీవ దహనం
పాకిస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాక్ లోని కరాచీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సు లో మంటలు చెలరేగి 21 మంది సజీవ దహనం అయ్యారు.

Pakistan: పాకిస్థాన్లో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. రన్నింగ్ బస్సు లో మంటలు చెలరేగి 21 మంది సజీవ దహనం అయ్యారు.
దాయాదీ దేశమైన పాకిస్థాన్లో ని కరాచీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అప్పటివరకు సాఫీగా సాగిన ప్రయాణం ఒక్కసారిగా విషాదాంతంగా మారింది. రన్నింగ్ బస్సులో అకస్మాతుగా మంటలు చెలరేగాయి. దానిని గమనించి ప్రయాణికులు తప్పించుకునేలోపే 21 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. మంటలు ధాటికి బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులోని ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేకుండా కాలిపోయాయి. కాగా ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: భారత్ సాయం కోరిన పాకిస్తాన్.. ఎందుకంటే..?