Justice D Y Chandrachud: 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డివై చంద్రచూడ్ నియామకం
భారత 50వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు.

New Delhi: భారత 50వ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. నవంబర్ 9న భారత ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టనున్న జస్టిస్ చంద్రచూడ్ కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అభినందనలు తెలిపారు.
సంప్రదాయ ప్రకారం పదవీ విరమణ చేయనున్న సీజేఐ యూయూ లలిత్ కొత్త సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును అక్టోబర్ 11న కేంద్రానికి సిఫారసు చేశారు. దానిని రాష్ట్రపతి ఆమోదించారు. సీజేఐ పదవిలో జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు, 2024 నవంబర్ 10 వరకూ కొనసాగుతారు. గతంలో ఆయన తండ్రి కూడా సీజేఐగా సేవలందించి వున్నారు. బాద్యతలు తీసుకొన్న అనంతరం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సీజేఐగా బాధ్యతలు చేపట్టిన ఘనత జస్టిస్ చంద్రచూడ్ కు దక్కనుంది.
ఇది కూడా చదవండి: President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాటరాక్ట్ సర్జరీ