Delhi Liquor Scam: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి సీబీఐ సమన్లు..
దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు గుప్పించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కేసులో ప్రధాన నిందితుడుగా సీబీఐ నమోదు చేసిన వారిలో ఒకరైన ఢిల్లీ ఆప్ పార్టీ కీలక నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.
Delhi: దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు గుప్పించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కేసులో ప్రధాన నిందితుడుగా సీబీఐ నమోదు చేసిన వారిలో ఒకరైన ఢిల్లీ ఆప్ పార్టీ కీలక నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. రేపటిదినం సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరవ్వాలంటూ పేర్కొన్నారు.
దీనిపై మనీశ్ సిసోడియా స్పందిస్తూ ఖచ్ఛితంగా హాజరౌతానని పేర్కొన్నారు. తన నివాసంలో 14 గంటల పాటు సీబీఐ అధికారులు సోదాలు చేశారన్నారు. ఒక లాకరు కూడ వెతికారని, తన స్వగ్రామానికి కూడా వెళ్లి సోదాలు చేసినా ఏమీ దొరలేదన్నారు. అసలు ఉంటే గదా దొరికేది అంటూ పేర్కొన్నారు. సత్యమే చివర గెలుపుగా మనీశ్ పేర్కొన్నారు.
మరోవైపు ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం మనీశ్ కు అండగా నిలిచారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ తో పోలుస్తూ, మనీశ్, సత్యేంద్ర జైనులు ఇరువురు నేటి భగత్ సింగ్ లుగా పేర్కొన్నారు. సంకల్పాన్ని ఎవ్వరూ దెబ్బతీయలేరని ఆప్ అధినేత పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ 15మంది పై కేసు నమోదు చేసింది.
పలువురి అరెస్టులు కూడా చేపట్టారు. తెలంగాణకు చెందిన పారిశ్రామిక వేత్త అభిషేక్ బోయనపల్లి ప్రమేయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒక విధంగా ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యవస్ధలను అడ్డు పెట్టుకొంటుందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. ఇందులో ప్రధానంగా సీఎం కేసిఆర్ కేంద్ర తీరును ఎండగడుతున్నారు.
ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాం.. అభిషేక్ ను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ