Last Updated:

Swati Maliwal: ఢిల్లీ మహిళా కమీషన్ చైర్‌ పర్సన్ స్వాతి మలివాల్ నివాసం పై దాడి.. కార్లు ధ్వంసం

ఢిల్లీ మహిళా కమీషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు.

Swati Maliwal: ఢిల్లీ మహిళా కమీషన్ చైర్‌ పర్సన్ స్వాతి మలివాల్ నివాసం పై దాడి.. కార్లు ధ్వంసం

Delhi: ఢిల్లీ మహిళా కమీషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం దాడి చేసి కార్లను ధ్వంసం చేశారు. తన ఇంట్లోకి ఎవరో ప్రవేశించేందుకు ప్రయత్నించారని, నివాసం వద్ద పార్క్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారని, ఘటన జరిగినప్పుడు తాను, తల్లి ఇంట్లో లేరని మలివాల్ ట్వీట్ చేశారు. ఆమె పోస్ట్‌లో ఢిల్లీ పోలీస్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేసారు.

ఈ ఘటన వెనుక గల కారణాలను, వ్యక్తులను పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అయితే, ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన మిరాండా హౌస్ ఘటనలో కొంతమంది పురుషులు మహిళా కళాశాల గోడ ఎక్కిన ఘటన పై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. క్యాంపస్‌లో దీపావళి పండుగను చూసేందుకు పురుషులు కళాశాల గోడలు ఎక్కి సెక్సిస్ట్ నినాదాలు” చేశారనే ఆరోపణల పై మహిళా కమీషన్ నగర పోలీసులకు మరియు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన మిరాండా హౌస్‌కు నోటీసు జారీ చేసింది. ఈ సందర్భంగా కళాశాల ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై స్వాతి మలివాల్ ప్రశ్నించారు.

అలాగే, రియాలిటీ షో బిగ్ బాస్ నుండి చిత్రనిర్మాత సాజిద్ ఖాన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖ రాసిన తర్వాత ‘ఇన్‌స్టాగ్రామ్’లో తనకు రేప్ బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ మలివాల్ కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీస్ యొక్క సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదును సమర్పించారు.వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరస్థులను అరెస్టు చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి: