Home / బ్రేకింగ్ న్యూస్
ముంబయి నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్ 1 నుండి 15వరకు ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమైనారు.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ భాజపా పై గురిపెట్టింది. భాజపాకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీలోని కీలక నేతల్ని తమ పార్టీలోకి చేర్చుకొంటున్నారు. ఒకే రోజు భాజపాకు చెందిన స్వామి గౌడ్, దాసోజి శ్రవణ్ లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ పార్టీ తీర్ధం పుచ్చుకొన్నారు.
ఏపీ ప్రభుత్వానికి జూనియర్ వైద్యుల సెగ తగిలింది. స్టైఫండ్ 42 శాతానికి పెంచాలంటూ డాక్టర్లు కోరికను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసు కూడా అందించారు. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల జూడాలు ఈ సమ్మెలో పాల్గొననున్నారు.
హైదరాబాదులో విద్యా వ్యవస్ధకు మచ్చ తెచ్చేలా చోటుచేసుకొన్న చిన్నారి లైంగిక దాడి వ్యవహరంలో బంజాహిల్స్ డీఏవీ పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సరైన నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ బ్లడ్ బ్యాంకు నిర్వాకం ఒక రోగి ప్రాణాలు తీసింది. ప్లాస్మాకు బదులు బత్తాయి రసం సైప్లై చేసిన వైనం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఢిల్లీవాసులకు ఈ ఏడాది కూడా దీపావళి పండుగ నాడు టపాకాయలు కాల్చేందుకు వీలు లేదు. దేశ రాజధాని ఢిల్లీలో టపాకాయల నిషేదాన్ని కొనసాగిస్తూ సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది.
రాజకీయ, ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ లో పరిస్ధితులు తారస్థాయికి చేరుకోన్నాయి. దీంతో బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రిటన్ లో అతి తక్కువ రోజులు పాలన చేసిన ప్రధానిగా ట్రస్ రికార్డుకెక్కారు. ఆమె కేవలం 44 రోజులే పదవిలో కొనసాగగలిగారు.
వారి జోవనోపాధికి దీపావళి పండుగ సమాధి కట్టేలా చేసింది. ఓ టపాసుల గోదాములో చోటుచేసుకొన్న పేలుడుకు నలుగురు బలైనారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకొనింది.
కరోనా ప్రభావం తగ్గిందనుకున్న ప్రతీ సారీ నేనున్నానంటూ ఎక్కడో దగ్గర తన ఉనికి చాటుకుంటూనే ఉంది కొవిడ్-19. కరోనా మరోసారి దాని విజృంభణను కొనసాగిస్తోంది. కరోనా వేరియంట్లలో అత్యంత ప్రమాదరక, వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్ఎక్స్ బీ వేరియంట్‌ను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తెలంగాణలోని విద్యార్థులకు అలర్ట్. దీపావళి సెలవు తేదీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా అక్టోబర్ 25వ తేదీని దీపావళి సెలవు దినంగా ప్రకటించారు. అయితే తాజాగా ఆ సెలవును అక్టోబర్ 24న అంటే సోమవారానికి మార్చింది.