Home / బ్రేకింగ్ న్యూస్
దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు దీపావళి కానుకగా ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 22న యువకులకు వారి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేయనున్నారు.
ఓ అభ్యర్ధి గుర్తు మార్చిన మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో)పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. దీంతో కొత్త ఆర్వో ఎంపికపై మూడు పేర్లను అధికారులు ఈసీకి పంపారు. నేటి సాయంత్రానికి కొత్త ఆర్వో పేరును ఈసీఐ ప్రకటించనుంది.
దీపావళి పండుగకు ముందు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం కారణంగా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటం పై నిషేధం విధించింది.
తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నికలు హీట్ పుట్టిస్తున్నాయి. బైపోల్స్ వేల రోజురోజుకు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మునుగోడు నియోజకవర్గంలో రాత్రికి రాత్రే జేపీ నడ్డాకు సమాధి కట్టడం కలకలం రేపుతుంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే విజయం; థరూర్‌కు 1072 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అత్యధికంగా విజయం సాధించి, రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌కు గాంధీయేతర అధ్యక్షుడిగా అవతరించేందుకు మార్గం సుగమం చేశారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, 2018లో రాష్ట్రంలోని తూత్తుకుడిలో జరిగిన పోలీసు కాల్పులకు సంబంధించిన పరిస్థితులపై ప్రత్యేక విచారణ కమీషన్ల నివేదికలను తమిళనాడు ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు.
మరొక్క సారి ప్యాకేజ్ స్టార్ అని నన్ను అంటే వైకాపా శ్రేణులను చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. దవడ వాచిపోయేలా కొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు
ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని సాంబశివరావు నివాసంతో పాటు, హైదరాబాద్, నెల్లూర్లలో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఏపీలో అధికార పార్టీ శ్రేణుల ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పాదయాత్రపై వైకాపా ఎంపీ భరత్ వర్గీయులు రెచ్చగొడుతూ వారిపై నీళ్ల బాటిళ్లను విసిరారు. దీంతో రాజమహేంద్రవరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది.