Air Bags in Maruti Suzuki: మారుతి కీలక నిర్ణయం.. ఆ కార్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు.. సేఫ్టీ లేదని ఎలాంటి టెన్షన్ వద్దు!

Air Bags in Maruti Suzuki: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా సోమవారం ఆల్టో కె10, వ్యాగన్ ఆర్, సెలెరియో, ఈకో మోడళ్లలోని అన్ని వేరియంట్లలో కస్టమర్లకు సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్ అందిస్తున్నట్లు తెలిపింది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. వివిధ విభాగాలలోని వినియోగదారుకలు మైరుగైన భద్రతను అందించే కంపెనీ నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుందని అన్నారు. మారుతి సుజికి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆధునిక రోడ్డు మౌలిక సదుపాయాలు, హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలు, అభివృద్ధి చెందుతున్న మొబిలిటీ ట్రెండ్‌లు బలమైన భద్రతా చర్యలు అవసరం గతంలో ఎన్నడూ లేనట్లు చూపిస్తాయని అని అన్నారు.
వ్యాగన్ ఆర్, ఆల్టో కె10, సెలెరియో, ఈకోలలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా మార్చాలనే నిర్ణయంతో, అందరికీ మెరుగైన భద్రత అందుబాటులో ఉండేలా కంపెనీ నిర్ధారిస్తోందని పార్థో బెనర్జీ అన్నారు. “ఈ మోడళ్లకు ఉన్న అపారమైన ప్రజాదరణ దృష్ట్యా, ఈ చర్య పెద్ద సంఖ్యలో వాహనదారులకు భద్రతా ప్రమాణాలను గణనీయంగా పెంచుతుంది.
దేశవ్యాప్తంగా ప్రయాణీకుల భద్రతకు మొత్తంగా దోహదపడుతుంది” అని బెనర్జీ అన్నారు. ఆ కంపెనీ తన అరీనా సేల్స్ నెట్‌వర్క్ ద్వారా వ్యాగన్ ఆర్, ఆల్టో కె10, సెలెరియో, ఈకో వంటి మోడళ్లను విక్రయిస్తుండగా, బాలెనో, గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి ప్రీమియం మోడళ్లను దాని నెక్సా నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తోంది.
2025-26లో భారత మార్కెట్లో తన ప్యాసింజర్ వాహనాల మొత్తం హోల్‌సేల్ అమ్మకాలు దాదాపు 1-2 శాతం పెరుగుతాయని జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ సోమవారం తెలిపింది. ఈ కాలంలో తమ పనితీరు పరిశ్రమ కంటే మెరుగ్గా ఉంటుందని కంపెనీ భారతీయ విభాగం మారుతి సుజుకి ఇండియా ఆశిస్తోంది.
2025-26లో మూలధన వ్యయంలో మొత్తం 380 బిలియన్ యెన్‌లను పెట్టుబడి పెట్టాలని కంపెనీ భావిస్తోంది. భారతదేశంలో తమ పెట్టుబడి దాదాపు 50 శాతం ఉంటుందని, ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని కంపెనీ యోచిస్తోందని సుజుకి తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- New Tata Altroz Launch: టాటా కొత్త ఆల్ట్రోజ్.. స్టైల్లో కొత్త రాక్షసుడు వచ్చేస్తున్నాడు.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?