Published On:

Upcoming Top 5 Electric Cars: మరికొన్ని రోజులే సమయం.. త్వరలో మన ముందుకు రానున్న టాప్ -5 ఎలక్ట్రిక్ కార్లు!

Upcoming Top 5 Electric Cars: మరికొన్ని రోజులే సమయం.. త్వరలో మన ముందుకు రానున్న టాప్ -5 ఎలక్ట్రిక్ కార్లు!

Upcoming Top 5 Electric Cars 2025: భారతీయ వినియోగదారులలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. మీరు కూడా సమీప భవిష్యత్తులో కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి, టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి ప్రముఖ కార్ల తయారీదారులు రాబోయే కాలంలో తమ అనేక ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భారత మార్కెట్లో విడుదల కానున్న అటువంటి 5 కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

 

Mahindra XEV 7e

మహీంద్రా తన ఫేమస్ ఎస్‌యూవీ ఎస్‌యూవీ 700 ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి మహీంద్రా XEV 7e అని పేరు పెట్టనున్నారు. అయితే, కంపెనీ ఇంకా తన బ్యాటరీ ప్యాక్‌ను ప్రకటించలేదు. మీడియా నివేదికల ప్రకారం, రాబోయే మహీంద్రా ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ పరిధిని అందించగలదు.

 

MG M9

రాబోయే వారాల్లో ఎంజీ భారత మార్కెట్లో M9 ఎంపీవీని విడుదల చేస్తుంది. దీన్ని బ్రాండ్ ప్రీమియం MG సెలెక్ట్ అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ వాహనం 90కిలోవాట్ బ్యాటరీని ఉపయోగిస్తుంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 430 కి.మీ. దూరం ప్రయాణించగలదు.

 

Mahindra XUV 3X0 EV

మహీంద్రా తన అద్భుతమైన ఎస్‌యూవీ XUV 3X0 ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయబోతోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3X0 EV టెస్టింగ్ సమయంతో చాలాసార్లు కనిపించింది. మీడియా నివేదికల ప్రకారం, మహీంద్రా ఎక్స్‌యూవీ 3X0 EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 నుండి 450 కిలోమీటర్ల పరిధిని అందించగలదు.

 

Maruti Suzuki E-Vitara

మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కంపెనీ రాబోయే ఎస్‌యూవీ మారుతి సుజుకి E విటారాను ప్రదర్శించారు. మారుతి E విటారా రెండు బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగిస్తుంది, ఇవి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ పరిధిని అందించగలదు.

 

Tata Harrier EV

టాటా మోటార్స్ తన ఫేమస్ ఎస్‌యూవీ హారియర్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా హారియర్ ఈవీ టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. మీడియా నివేదికల ప్రకారం, టాటా హారియర్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ పరిధిని అందించగలదు.