Last Updated:

Budget Scooters: బాగా మైలేజ్ ఇచ్చే స్కూటర్లు.. మొబైల్ ధరకే కొనచ్చు.. వీటిని మించినవి లేవు..!

Budget Scooters: బాగా మైలేజ్ ఇచ్చే స్కూటర్లు.. మొబైల్ ధరకే కొనచ్చు.. వీటిని మించినవి లేవు..!

Budget Scooters: దసరా, దీపావళి పండుగలు ముగిశాయి. పండుగకు ఈ సరికొత్త స్కూటర్‌ని కొనలేదని బాధపడకండి. మీ రోజువారీ అవసరాలు తీర్చడానికి కొన్ని స్కూటర్‌లు రూ.80,000 కంటే తక్కువ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. చౌక ధర కారణంగా ఫీచర్లు,  పనితీరులో ఎటువంటి రాజీ లేకుండా కంపెనీలు కొత్త స్కూటర్లను విక్రయిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలు సులభంగా కొనుగోలు చేయగల స్కూటర్ల గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

Yamaha Fascino 125
ముందుగా యమహా ఫాసినో 125 స్కూటర్ గురించి మాట్లాడుకుందాం. ఇది రూ.79,150 నుండి రూ.94,530 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 8.2 PS హార్స్ పవర్, 10.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేసే 125 cc ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 68.75 kmpl మైలేజీని అందిస్తుంది. ఇతర ఫీచర్లలో ఫుల్ ఎల్‌ఈడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, హాలోజన్ హెడ్‌లైట్లు ఉన్నాయి. ఈ స్కూటర్ బరువు 99 కిలోలు, భద్రత కోసం డ్రమ్, డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

Honda Activa 6G
హోండా యాక్టివా 6జీ కనిష్ట ధర రూ.79,624, గరిష్ట ధర రూ.84,624 (ఎక్స్-షోరూమ్)తో ప్రముఖ స్కూటర్‌గా నిలిచింది. ఇది 7.79 PS హార్స్‌పవర్, 8.84 Nm టార్క్ ఉత్పత్తి చేసే 109 cc పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 59.5 kmpl మైలేజీని కూడా అందిస్తుంది. ఈ స్కూటర్ ACG స్టార్టర్, ఇంజిన్ కిల్ స్విచ్, ఇంటిగ్రేటెడ్ పాస్ స్విచ్, LED హెడ్‌లైట్, సెమీ డిజిటల్ క్లస్టర్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లతో వస్తుంది. అలానే స్టాండర్డ్, DLX, H-Smart అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

Hero Pleasure Plus
హీరో ప్లెజర్ ప్లస్ గురించి చెప్పాలంటే.. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.72,163 నుండి రూ.83,918. ఇది 50 kmpl మైలేజీని అందించే 110.9 cc పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఇది LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్, LCD స్క్రీన్‌తో సహా వివిధ ఫీచర్లను పొందుతుంది.

TVS Jupiter
టీవీఎస్ జూపిటర్ 110 కూడా ఒక ఫేమస్ స్కూటర్. దీని కనిష్ట ధర రూ.77,400, గరిష్ట ధర రూ.90,150 ఎక్స్-షోరూమ్. ఇది 113 cc పెట్రోల్ ఇంజన్, 47 kmpl మైలేజీని అందిస్తుంది. ఇది ఇంటెలిజెంట్ స్టార్ట్/స్టాప్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్‌లను కలిగి ఉంది.

Suzuki Access
సుజుకి యాక్సెస్ 125 గురించి మాట్లాడితే ఈ స్కూటర్ ధర రూ.79,899 నుండి రూ.90,500 (ఎక్స్-షోరూమ్). ఇది 124 cc పెట్రోల్ ఇంజన్. 45 kmpl మైలేజీని అందిస్తుంది. ఇది LED హెడ్‌లైట్, సెమీ-డిజిటల్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్‌తో సహా వివిధ ఫీచర్లను పొందుతుంది.