Published On:

Lamborghini Temerario Launched: కేవలం 2.7 సెకన్లలో 100 కి.మీ హైస్పీడ్.. లగ్జరీ లంబోర్గిని సూపర్ కారు వస్తోంది.. ఈరోజే లాంచ్..!

Lamborghini Temerario Launched: కేవలం 2.7 సెకన్లలో 100 కి.మీ హైస్పీడ్.. లగ్జరీ లంబోర్గిని సూపర్ కారు వస్తోంది.. ఈరోజే లాంచ్..!

Lamborghini Temerario Launched: ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సూపర్ కార్లు, ఎస్‌యూవీలకు ప్రసిద్ధి చెందిన లంబోర్గిని, భారతదేశంలో తన కొత్త కారు టెమెరారియోను విడుదల చేయబోతోంది. ఈ అద్భుతమైన సూపర్ ఎస్‌యూవీ అధికారికంగా 30 ఏప్రిల్ 2025న భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇది ఇప్పటికే ఆగస్టు 2024లో ప్రపంచ మార్కెట్లోకి విడుదలైంది. ఈ నేపథ్యంలో కారులో ఎటువంటి ఇంజిన్ ఉంటుంది? ధర ఎంత? స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

 

Lamborghini Temerario Engine
ఈ సూపర్ కారులో కంపెనీ నాలుగు-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌ను అందిస్తారు. ఈ ఇంజిన్‌తో పాటు, హైబ్రిడ్ టెక్నాలజీని కూడా అందించారు. దీనిలో కారు మూడు మోటార్ల నుండి శక్తిని పొందుతుంది. దీని V8 ఇంజిన్ ఒక్కటే 800 బిహెచ్‌పి పవర్, 730 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ టెక్నాలజీతో దీని పవర్ 920 హార్స్‌పవర్, 800 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Lamborghini Temerario Top Speed
నాలుగు లీటర్ల హైబ్రిడ్ ఇంజిన్‌తో వచ్చే ఈ ఎస్‌యూవీ కేవలం 2.7 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 343 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

 

Lamborghini Temerario Featurtes
ఈ సూపర్ కారును హురాకాన్ లాగా రూపొందించారు. కానీ ఇందులో హురాకాన్ కంటే ఎక్కువ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. షార్క్ నోస్ బంపర్‌తో హెక్సాగానల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, 20, 21 అంగుళాల అల్లాయ్ వీల్స్, కార్బన్ ఫైబర్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8.4 అంగుళాల పోర్ట్రెయిట్ టచ్ స్క్రీన్, 9.1 అంగుళాల ప్యాసింజర్ స్క్రీన్‌లు ఉన్నాయి. అలాగే హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు.

 

Lamborghini Temerario Price
టెమెరారియో ఖచ్చితమైన ధరను లాంబోర్గిని విడుదల సమయంలో వెల్లడిస్తుంది. కానీ దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 6 నుండి 7 కోట్లు ఉండవచ్చని అంచనా. మార్కెట్లో, ఇది ఫెరారీ, ఆస్టన్ మార్టిన్ వంటి సూపర్ కార్లతో నేరుగా పోటీపడుతుంది.