Published On:

Most Comfortable CNG Cars: పెట్రోల్ ఖర్చుకు టాటా బై బై.. 33 కి.మీ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్లు ఇవే.. వెరీ కంఫర్టబుల్..!

Most Comfortable CNG Cars: పెట్రోల్ ఖర్చుకు టాటా బై బై.. 33 కి.మీ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్లు ఇవే.. వెరీ కంఫర్టబుల్..!

Most Comfortable CNG Cars: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఎలక్ట్రిక్ కార్లు చాలా ఖరీదైనవి. అటువంటి పరిస్థితిలో, CNG కార్లకు ఇప్పటికీ చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఎంట్రీ లెవల్ కార్ల నుండి ప్రీమియం CNG కార్ల వరకు అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రీమియం CNG కారు కొనాలని ఆలోచిస్తుంటే, మీకు ఉత్తమ ఎంపికగా ఉండే రెండు అత్యంత అద్భుతమైన CNG కార్ల గురించి తెలుసుకుందాం.

 

Maruti Suzuki Swift CNG
మారుతి సుజుకి స్విఫ్ట్ CNG మంచి ఎంపిక. అందులో మంచి స్థలం కూడా ఉంది. ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, స్విఫ్ట్ CNG 1.2 లీటర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజిన్ 70 పిఎస్ పవర్, 102ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. CNG మోడ్‌లో 33 కి.మీ/కి.గ్రా మైలేజీని అందిస్తుంది.

 

సేఫ్టీ కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, 3 పాయింట్ల సీట్ బెల్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కారులో 5 మంది సులభంగా కూర్చోవచ్చు. బూట్ లో పెద్ద CNG ట్యాంక్ ఉంది కానీ సామాను నిల్వ చేసుకోవడానికి స్థలం లేదు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.8.19 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

 

Hyundai Grand i10 Nios CNG
హ్యుందాయ్ i10 నియోస్ CNG మంచి ఎంపిక. దీనిలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. దీని మాగ్నా వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7,75,300,స్పోర్ట్జ్ వేరియంట్ ధర రూ. 8.30,000. ఈ కారులో 1.2L బై-ఫ్యూయల్ (పెట్రోల్ + CNG) ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 69పిఎస్ పవర్, 95.2ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 60 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది.

 

ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ కారు కిలోకు 27 కి.మీ మైలేజీని అందిస్తుంది. సేఫ్టీ కోసం ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, వెనుక పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందించారు.