BYD Sealion 6: కారు ఎక్కామంటే 1092 కిమీ ప్రయాణం.. బీవైడీ సీలియన్ 6 ఎస్‌యూవీ.. ఇదేం స్పీడ్ రా బాబు..!
![BYD Sealion 6: కారు ఎక్కామంటే 1092 కిమీ ప్రయాణం.. బీవైడీ సీలియన్ 6 ఎస్‌యూవీ.. ఇదేం స్పీడ్ రా బాబు..!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/Untitled-1-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-36.gif)
BYD Sealion 6: బీవైడీ ఆటో ఎక్స్‌పో 2025లో సీలియన్ 6ని పరిచయం చేసింది. కారు టెస్టింగ్ సమయంలో కూడా కనిపించింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కారును దేశంలో త్వరలోనే లాంచ్ చేయచ్చు. ‘BYD Sealion 6’ అనేది బీవైడీ మొట్టమొదటి ప్లగ్-ఇన్-హైబ్రిడ్ మోడల్‌గా ఇండియాలోకి వస్తుంది. అయితే ఈ కారు ఇప్పటికే ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి మార్కెట్లలో అందుబాటులో ఉంది. సింగిల్ ఛార్జ్‌పై 1092 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దేశంలో సీలియన్ 6ను ఎప్పుడు లాంచ్ అవుతుందనేది బీవైడీ ఇంకా ధృవీకరించలేదు.
ప్రపంచవ్యాప్తంగా సీలియన్ 6ను రెండు ఇంజన్ ఆప్షన్స్‌లో పరిచయం చేయనున్నారు. దీనిలో ఒక మోడల్ 1.5-లీటర్ ఇంజిన్‌తో ఉంటుంది. ఈ ఇంజన్ 215 బీహెచ్‌పి పవర్, 300ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. అయితే ఈ కారు ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్ 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ వెనుక రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో జత చేసి ఉంటుంది. ఈ వేరియంట్ 319బిహెచ్‌పి పవర్, 550ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు వేరియంట్‌లు 18.3కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో ఉండగా, ఫ్రంట్-వీల్-డ్రైవ్ వేరియంట్ మొత్తం 1092 కిమీ రేంజ్ అందిస్తుంది.
బీవైడీ సీలియన్ 6 ఎస్‌యూవీ డిజైన్ చాలా ప్రీమియంగా ఉంటుంది. వీల్ ఆర్చ్‌ల చుట్టూ క్లాడింగ్‌ను ఉపయోగించడం ఇందులో ఉంది. ఈ కారు ముందు బంపర్‌పై అనేక రకాల కట్‌లు ఉన్నాయి, ఇవి ఎయిర్ ఇన్‌టేక్‌లుగా పనిచేస్తాయి. సీలియన్ 6 పెద్ద ఫ్రీస్టాండింగ్ 15.6-అంగుళాల తిరిగే టచ్‌స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది. ఇందులో హీటింగ్, వెంటిలేషన్, డ్యూయల్ ZOVE క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, హెడ్-అప్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌తో ఎలక్ట్రిక్‌గా అడ్జస్ట్ చేయగల ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఈ కారు అంచనా ధర దాదాపు రూ. 30 లక్షలు ఉండవచ్చు.