Tata Safari Price Hike: కార్ లవర్స్‌కు దేశీయ దిగ్గజం షాక్.. భారీగా పెరిగిన టాటా సఫారీ ఎస్‌యూవీ ధర..!
![Tata Safari Price Hike: కార్ లవర్స్‌కు దేశీయ దిగ్గజం షాక్.. భారీగా పెరిగిన టాటా సఫారీ ఎస్‌యూవీ ధర..!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/Untitled-1-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-32.gif)
Tata Safari Price Hike: టాటా మోటర్స్ ఇండియాలో నమ్మకమైన ఆటోమొబైల్ కంపెనీగా పేరు. దేశీయ మార్కెట్లో అనేక ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లతో వివిధ కార్లను విక్రయిస్తుంది. అంతేకాకుండా ఈ కార్లను బడ్జెట్ ప్రైస్‌లో కొనుగోలు చేయడానికి కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ తన ఫ్యామిలీ ఎస్‌యూవీ సఫారి ధరలను కొద్దగా పెంచింది. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టాటా సఫారీ ఎస్‌యూవీ వివిధ వేరియంట్‌ల ధర దాదాపు రూ.36,000 వరకు పెరిగింది. ధరల పెంపు తర్వాత, కొత్త సఫారీ కారు కనిష్ట ధర రూ.15.50 లక్షలు, గరిష్ట ధర రూ.27 లక్షలు ఎక్స్-షోరూమ్. ఈ సఫారి ఎస్‌యూవీ స్మార్ట్, స్మార్ట్ (O), అడ్వెంచర్, అకాంప్లిష్డ్ ప్లస్‌తో సహా అనేక రకాల ఆప్షన్లు ఉన్నాయి.
కాస్మిక్ గోల్డ్, స్టార్‌డస్ట్ యాష్, స్టెల్లార్ ఫ్రాస్ట్, సూపర్‌నోవా కాపర్, లూనార్ స్టేట్‌తో సహా వివిధ రకాల ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది. కొత్త టాటా సఫారి కారు విశాలమైన 6/7 సీట్ల ఎంపికతో వస్తుంది. ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. వీకెండ్, హాలిడే ట్రిప్పులకు వెళ్లినప్పుడు ఎక్కువ లగేజీని తీసుకెళ్లేందుకు 420 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
కొత్త టాటా సఫారి ఎస్‌యూవీలో పవర్ ఫుల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ ఉంది. ఇందులో 2-లీటర్ డీజిల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 170 పిఎస్ పవర్, 350 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్/ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. సఫారి ఎస్‌యూవీ 14.50 నుండి 16.30 kmpl మైలేజీని ఇస్తుంది.
ఈ కారు ఫీచర్ల గురించి చెప్పాలంటే.. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ , డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 10-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఏసీ, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్త టాటా సఫారీ కారు ప్రయాణీకులకు గరిష్ట రక్షణను అందిస్తుంది. భద్రత పరంగా 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.
ఈ కారు వివిధ వేరియంట్‌లు రూ.1,000 నుండి రూ.36,000 వరకు ధరలను పెరిగాయి. దీని ధర రూ.15 లక్షల నుండి రూ.26.25 లక్షల వరకు ఎక్స్-షోరూమ్. 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికను కలిగి ఉంది, ఇది 14.60 నుండి 16.8 kmpl మైలేజీని అందిస్తుంది.