Last Updated:

Maruti Suzuki e Vitara Bookings: అందరి ఎదురుచూపులు ఈ కారు కోసమే.. మారుతి ఫస్ట్ ఈవీ.. బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి..!

Maruti Suzuki e Vitara Bookings: అందరి ఎదురుచూపులు ఈ కారు కోసమే.. మారుతి ఫస్ట్ ఈవీ.. బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి..!

Maruti Suzuki e Vitara Bookings: మారుతి సుజికి తన మొదటి ఎలక్ట్రిక్ కార్ ఇ-విటారాను ఆటో ఎక్స్‌పో 2025లో పరిచయం చేసింది. ఈ కారు కాంపాక్ట్ సైజు, లాంగ్ రేంజ్ కారణంగా ప్రజలు దీన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇప్పుడు కారు బుకింగ్స్ కూడా ప్రారంభయ్యాయని వార్తలు వస్తున్నాయి. వినియోగదారులు రూ.25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కానీ బుకింగ్ డీలర్‌షిప్ స్థాయిలో మాత్రమే జరుగుతోంది. ఇంకా కంపెనీ నుండి ఎటువంటి అప్‌డేట్ లేదు. మీరు కూడా e Vitaraని కొనాలనుకొంటే నెక్సా  డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. దీని ఫీచర్లు, రేంజ్ తదితర వివరాలు తెలుసుకుందాం.

కొత్త ఇ-విటారా నెక్సా బ్లూ, గ్రాండియర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, ఓపులెంట్ రెడ్, బ్లూయిష్ బ్లాక్ సింగిల్-టోన్‌తో స్ప్లెండిడ్ సిల్వర్, ఓపులెంట్ రెడ్, ఆర్కిటిక్ వైట్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్ డ్యూయల్-టోన్ కలర్స్‌తో రానుంది. బ్లూయిష్ బ్లాక్ రూఫ్‌ కారులో ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ కారు కొలతల గురించి చెప్పాలంటే.. దీని పొడవు 4,275ఎమ్ఎమ్, వెడల్పు 1,800ఎమ్ఎమ్, ఎత్తు 1,635ఎమ్ఎమ్, వీల్‌బేస్ 2,700ఎమ్ఎమ్, గ్రౌండ్ క్లియరెన్స్ 180ఎమ్ఎమ్. కారు ఇతర ఫీచర్లలో R18 ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్, పాలీహెడ్రల్ మస్కులర్ స్టాన్స్, 3డీ బోనెట్‌తో ఆకర్షణీయమైన ఫ్రంట్ ఫాసియా ఉంటుంది. అలానే  ముందు భాగంలో యాక్టివ్ ఎయిర్ వెంట్‌లు, స్టాండర్డ్ పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి.

కారు ముందు భాగంలో 3-పాయింట్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ డీఆర్ఎల్, వెనుక ల్యాంప్‌ ఉంది. ఇందులోని డ్రైవర్ సీటును 10 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాలు,  లెవల్-2 అడాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మారుతి కంపెనీ ఇ-విటారాను ఫ్యూర్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై మాన్యుఫ్యాక్చరింగ్ చేసింది. ఈ కారులో 49 కిలోవాట్, 61కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇవి రెండు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తాయి.  వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా బ్యాటరీ ప్యాక్‌ని ఎంచుకోవచ్చు. ఇ విటారా గుజరాత్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. అక్కడి నుండి జపాన్, యూరప్‌లకు ఎగుమతి చేస్తుంది. నెక్సా అవుట్‌లెట్ల ద్వారా కూడా కొనుగోలు చేయచ్చు. కారు ధర దాదాపు రూ. 18 నుంచి 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.