Last Updated:

Shahid Kapoor: ఆమెతో బ్రేకప్‌ నా జీవితాన్ని మార్చేసింది – షాహిద్‌ కపూర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Shahid Kapoor: ఆమెతో బ్రేకప్‌ నా జీవితాన్ని మార్చేసింది – షాహిద్‌ కపూర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Shahid Kapoor About His Break Up: బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్ లవ్‌, బ్రేకప్‌పై స్పందించాడు. తన పాస్ట్‌ రిలేషన్‌లో ఎన్నోసార్లు తన ఆత్మగౌరవాన్ని కోల్పోయిన పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పాడు. షాహిద్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ దేవా మూవీ జనవరి 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్‌ పాడ్‌కాస్ట్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా దేవా మూవీ విశేషాలను పంచుకున్న షాహిద్‌ స్టార్‌ ఓ హీరోయిన్‌తో లవ్‌, బ్రేకప్‌పై స్పందించాడు. పెళ్లికి ముందు బ్రేకప్‌ తనని జీవితాన్నే మార్చేసిందన్నాడు.

“ప్రేమలో మనం ఒకరిని అమితంగా ఇష్టపడతాం. ఎంతలా అంటే మనకంటే కూడా వారినే ఎక్కువ ఇష్టపడతాం. కానీ వారు తిరస్కరించినప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుందో దానిని నేను అనుభవించాను. వారి పొందాలనే ఆశతో తిరస్కరించినా వారి వెంటపడతాం. ఆ సమయంలో మన ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నామనే విషయాన్ని కూడా గ్రహించలేం. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎన్నో చూశాను. కానీ వాటి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఒకరితో ప్రేమలో పడటం సులభమే కానీ, ఆ వ్యక్తితో జీవితం ఎలా ఉంటుందనేది ఆలోచించుకోవాలి. మనం ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను, శ్రద్ధను కోరుకుంటాం.

కానీ వారికి కూడా మనం వాటిని అందించగలమా లేదా అనేదే విషయం. మనం మన జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు చాలా ఆలోచించాలని. మనకు ఎలాంటి వారకు కావాలనేది స్పష్టత ఉండాలి. జీవిత భాగస్వామి విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే జీవితమంతా బాధపడాల్సి వస్తుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ బీ-టౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా మీరా రాజ్‌పుత్‌తో పెళ్లికి ముందు షాహిద్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌తో ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. ఇద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించారు.

బాలీవుడ్‌లో క్యూట్‌ కపుల్‌గా ఉండే ఈ లవ్‌బర్డ్స్‌ సడెన్‌ బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఇందుకు కారణాల తెలియదు కానీ, వీరిద్దరి లవ్‌, బ్రేకప్‌ ఎప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతుంది. కరీనాతో బ్రేకప్‌ తర్వాత కొంతకాలానికి మీరా రాజ్‌పుత్‌ను 2015లో పెళ్లి చేసుకున్నాడు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వారిద్దరి వైవాహిక బంధానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా షాహిద్‌ భార్యకు యానివర్సిరీ విషెస్‌ తెలుపుతూ ఓ పోస్ట్‌ చేశాడు. ఇందులో మీరాను కలిసే ముందు వరకు పెద్దలు కుదిర్చిన వివాహంపై తనకు నమ్మకం ఉండేది కాదని, ఆమె తన లైఫ్‌లోకి వచ్చాక తన జీవితమే మారిపోయిందాడు. తనతో జీవితం చాలా సంతోషంగా ఉందని పోస్ట్‌లో పేర్కొన్నాడు.