Last Updated:

Monkeypox: ఢిల్లీలో నైజీరియన్ మహిళకు మంకీ ఫాక్స్.. భారత్ లో 13కు చేరిన కేసుల సంఖ్య

ఢిల్లీలోని ఒక నైజీరియన్ మహిళకు మంకీ ఫాక్స్ పాజిటీవ్ గా నిర్దారణ కావడంతో భారత్ లో కేసులసంఖ్య 13కి చేరుకుంది. మంకీపాక్స్‌తో బాధపడుతున్న మరో వ్యక్తి కూడా ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Monkeypox: ఢిల్లీలో నైజీరియన్ మహిళకు మంకీ ఫాక్స్.. భారత్ లో 13కు చేరిన కేసుల సంఖ్య

Delhi: ఢిల్లీలోని ఒక నైజీరియన్ మహిళకు మంకీ ఫాక్స్ పాజిటీవ్ గా నిర్దారణ కావడంతో భారత్ లో కేసులసంఖ్య 13కి చేరుకుంది. మంకీపాక్స్‌తో బాధపడుతున్న మరో వ్యక్తి కూడా ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 15 మరణాలు నమోదయ్యాయి.

ఓరోఫారింజియల్ స్వాబ్స్, నాసోఫారింజియల్ స్వాబ్స్ మరియు మూత్ర నమూనాలను, చురుకైన చర్మ గాయాలు లేని సందర్భాల్లో మంకీపాక్స్ నిర్ధారణకు క్లిష్టమైన నమూనాలుగా పరిగణించాలని ఐసిఎంఆర్ అధ్యయనం తెలిపింది. భారతదేశంలో కేరళ లో మంకీపాక్స్ యొక్క మొదటి కేసు నమోదయింది. ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో విపరీతమైన జ్వరం ఉన్నవారిలో వైరల్ వ్యాధిని నిర్ధారించడానికి అవసరమైన పరీక్షలను నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: