Last Updated:

Delhi commission for women: డిల్లీ మహిళాకమీషన్ లో 223 మంది ఉద్యోగులను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా

డిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకె సక్సేనా డిల్లీ కమిషన్‌ ఫర్‌ విమెన్‌పై (డీసీడబ్ల్యు) పై కన్నెర్ర జేశారు. స్వాతిమలీవాల్‌ డీసీడబ్ల్యు చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు .. ఫైనాన్స్‌డిపార్టుమెంట్‌ కానీ.. లేదా అప్పటి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి లేకుండా 233 మందిని దిల్లీ కమిషన్‌ ఫర్‌ విమెన్‌లో ఉద్యోగులను నియమించారు.

Delhi commission for women: డిల్లీ మహిళాకమీషన్ లో 223 మంది  ఉద్యోగులను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా

 Delhi commission for women: డిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకె సక్సేనా డిల్లీ కమిషన్‌ ఫర్‌ విమెన్‌పై (డీసీడబ్ల్యు) పై కన్నెర్ర జేశారు. స్వాతిమలీవాల్‌ డీసీడబ్ల్యు చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు .. ఫైనాన్స్‌డిపార్టుమెంట్‌ కానీ.. లేదా అప్పటి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనుమతి లేకుండా 233 మందిని దిల్లీ కమిషన్‌ ఫర్‌ విమెన్‌లో ఉద్యోగులను నియమించారు. తాజాగా దిల్లీ ఎల్‌జీ తన అనుమతి లేకుండా నియమించినందుకు మొత్తం 223 మంది మహిళా ప్యానెల్‌ ఉద్యోగులను తొలగించారు. దీనిపై స్వాతి మలీవాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిబంధనలకు విరుద్దంగా..( Delhi commission for women)

అడిషనల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ది విమెన్ అండ్‌ చైల్డ్‌ డిపార్టుమెంట్‌ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం… డీసీడబ్ల్యు చట్ట ప్రకారం 40 పోస్టుల భర్తీకి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. అయితే అదనంగా కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడానికి డీసీబ్ల్యుకు ఎలాంటి అధికారం లేదని తెలిపింది. కొత్త ఉద్యోగులను తీసుకోవడానికి ముందు ఎలాంటి నిబంధనలు పాటించలేదు. అదే విధంగా అదనపు సిబ్బంది కావాలనుకున్నప్పుడు ప్రతి పోస్టుకు తీసుకునే సిబ్బంది అర్హత కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. కొత్తగా ఉద్యోగులను తీసుకొనే ముందు అడ్మినిస్ర్టేటిల్‌ అనుమతి తీసుకోవడంతో పాటు గవర్నమెంట్‌ ఆఫ్‌ ఎన్‌సీటీ డిల్లీ నుంచి అనుమతి తీసుకోవాలి.వారికి వేతనాలకు ఎంత వ్యయం అని మదింపు చేయకుండా ఇష్టం వచ్చినట్లు నియమించుకున్నారని ఆక్షేపించారు. కొత్తగా ఉద్యోగులను తీసుకున్న వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. అయితే ఎల్‌జీ కార్యాలయం నుంచి వస్తున్న వార్తల ప్రకారం ఈ 233 ఉద్యోగాల విషయానికి వస్తే ఇవన్నీ ఆమ్‌ఆద్మీ పార్టీకి చెందిన కార్యకర్తలతో నింపారని చెబుతున్నారు.

తాజాగా ఎల్‌జీ 233 మంది ఉద్యోగులను తీసివేసిన తర్వాత స్వాతి మలీవాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తుగ్లక్‌ చర్య అని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. డీసీడబ్ల్యులో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. దిల్లీ విమెన్స్‌ కమిషన్‌లో మొత్తం 90 మంది సిబ్బంది ఉంటే వారిలో కేవలం 8 మందిని మాత్రమే ప్రభుత్వం నియమించింది. మిగిలిన వారంతా మూడు నెలల కాంట్రాక్టుపై నియమించిన వారేనని అన్నారు. ఒక వేళ కాంట్రాక్టు సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తే.. మహిళా కమిషన్‌ పనిచేయలేదు. విమెన్‌ కమిషన్‌ను రక్తం, చెమటతో నిర్మించుకున్నామన్నారు. ఎల్‌జీ ఉద్యోగులకు.. ఉద్యోగ భద్రత కల్పించాల్సింది పోయి.. వారిని అన్యాయం చేస్తున్నారని స్వాలి మలీవాల్‌ మండిపడ్డారు. తాను బతికున్నంత వరకు మహిళా కమిషన్‌ మూతపడనీయను అని అన్నారు. తనను జైల్లో వేసినా.. తనను చిత్రహింసలు పెట్టినా సరే మహిళా కమిషన్‌ను కాపాడుకుంటామని ఆమె ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.