Home / Monkeypox
ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ విజృంభిస్తున్న సమయంలో ఆయా దేశాలు విదేశీ ప్రయాణికులకు పలు సూచనలు చేస్తున్నాయి. అయితే, విదేశీయులతో పాటు ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన వారి చర్మాన్ని తాకొద్దని తాజాగా చైనాలోని ఓ ఉన్నతాధికారి హెచ్చరించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
ఢిల్లీలోని ఒక నైజీరియన్ మహిళకు మంకీ ఫాక్స్ పాజిటీవ్ గా నిర్దారణ కావడంతో భారత్ లో కేసులసంఖ్య 13కి చేరుకుంది. మంకీపాక్స్‌తో బాధపడుతున్న మరో వ్యక్తి కూడా ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి కరోనా, మంకీపాక్స్, హెచ్‌ఐవీ ఒకేసారి నిర్ధారణ అయ్యాయి. ఈ తరహా కేసు నమోదవ్వడం మెడికల్ హిస్టరీలో ఇదే తొలిసారి. ఈ మేరకు ‘జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్’లో ఒక రిపోర్ట్ ప్రచురితమైంది. బాధిత వ్యక్తి స్పెయిన్ పర్యటనకు వెళ్లొచ్చిన 9 రోజుల తర్వాత అతడిలో గొంతునొప్పి,
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామో ఘెబ్రేయేషన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఇప్పటి వరకు మంకీపాక్స్ 92 దేశాలకు విస్తరించగా, 35వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలో ఐదవ మంకీ పాక్స్ కేసు నమోదు అయ్యింది. ఆఫ్రికా జాతికి చెందిన 22 ఏళ్ల యువతికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్‌కుమార్ తెలిపారు.
దేశంలో మంకీ పాక్స్ కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో 36 పడకలతో మంకీ పాక్స్ వార్డును ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తే విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడకు
దేశంలో క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మొదటి కేసు కేరళలో వెలుగు చూడగా.. రెండో కేసు కూడా కేరళలోనే నమోదైంది. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ కేసు వెలుగు చూసినట్లు రాష్ర్ట వైద్యశాఖ ధ్రువీకరించింది. 31 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఈ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిపై దృష్టి