Los Angeles Olympics: 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి ఐఓసీ ఆమోదం
లాస్ ఏంజిల్స్ లో 2028లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను కూడా జత చేస్తున్నట్లు ఐఓసీ బోర్డు అమోదం తెలిపింది. కాగా ఐఓసీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. వచ్చే ఒలింపిక్స్ ఐదు కొత్త క్రీడలను జత చేయనున్నారు.

Los Angeles Olympics: లాస్ ఏంజిల్స్ లో 2028లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను కూడా జత చేస్తున్నట్లు ఐఓసీ బోర్డు అమోదం తెలిపింది. కాగా ఐఓసీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. వచ్చే ఒలింపిక్స్ ఐదు కొత్త క్రీడలను జత చేయనున్నారు. వాటిలో క్రికెట్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ ప్రతిపాదను ఉన్నట్లు సమాచారం. శుక్రవారం నాడు ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు క్రికెట్‌తోపాటు ప్లాగ్ పుట్‌బాల్‌ను కూడా జత చేయాలని ఆమోదం తెలిపింది.
క్రికెట్ తో పాటు 5 క్రీడలు..(Los Angeles Olympics)
కాగా నిర్వహకులు 2028 ఎల్ఏ గేమ్స్‌లో క్రికెట్‌తో పాటు ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోసెస్, స్క్వాష్, బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్‌ను కూడా వచ్చే ఒలింపిక్స్‌లో జత చేయాలని నిర్ణయించామని చెప్పారు.ఐఓసీ నిబంధనల ప్రకారం క్రీడలు జరిగే నగరంలో కొత్త కొత్త క్రీడలు పరిచయం చేయమని విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా కొత్త జత చేసే క్రీడల ప్రతిపాదనలను ఐఎసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు .. ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ ఆమోదించారు. ఈ విషయాన్ని బోర్డు ఎగ్జిక్యూటివ్ సమావేశం తర్వాత బాచ్ మీడియాకు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- Revanth Reddy Warning: కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తే మిత్తితో చెల్లిస్తాం.. రేవంత్ రెడ్డి
- AP CMO office: ఏపీ సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ విడుదల