Uttarakhand: సంచలన నిర్ణయం తీసుకున్న ఉత్తరాఖండ్
గవర్నమెంట్ ఉద్యోగులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విధులకు రాకుండా ఎక్కువకాలం సెలవులో ఉన్న టీచర్లతో రిటైర్మెంట్ చేయించనుంది. వారి స్థానంలో కొత్తగా నియమాకాలు చేపట్టనుంది.
Uttarakhand: గవర్నమెంట్ ఉద్యోగులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విధులకు రాకుండా ఎక్కువకాలం సెలవులో ఉన్న టీచర్లతో రిటైర్మెంట్ చేయించనుంది. వారి స్థానంలో కొత్తగా నియమాకాలు చేపట్టనుంది. ఈ మేరకు రాష్ర్ట విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ ప్రకటించారు. విద్యార్థుల ప్రయోజనాలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు.
సుదీర్ఘకాలం సెలవులో (Uttarakhand)
ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరుకాకుండా సుదీర్ఘకాలం సెలవులో ఉన్న టీచర్లతో పదవీ విరమణ చేయించనుంది. వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ ఇటీవల ప్రకటించారు. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
6 నెలలు అంతకంటే ఎక్కువ కాలం నుంచి పాఠశాలలకు రాకుండా విధుల నుంచి తప్పించుకుంటున్న టీచర్ల లిస్ట్ ను తయారు చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి ఆదేశించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇలాంటి వాళ్లు దాదాపు 150 మంది ఉన్నారని.. వారందరితో పదవీ విరమణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. లిస్ట్ పూర్తి అయిన తర్వాత వారికి రిటైర్మెంట్ ఇచ్చి.. కొత్తగా నియామకాలు చేపట్టనున్నట్టు సమాచారం.
రాకపోకలు ఇబ్బందంటూ
ఉత్తరాఖండ్ లో కొండల ప్రాంతంలో ఉన్న జిల్లాల్లో నియామకాలు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో చాలా మంది విధులకు రావడం లేదని అధికారుల తనిఖీల్లో తేలింది. కొండల ప్రాంతాల్లో రాకపోకలు ఇబ్బందిగా ఉన్నాయంటూ.. చాలా మంది దీర్ఘకాల సెలవులను తీసుకుంటున్నట్టు విద్యాశాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. కొందరైతే ‘జీతం లేని సెలవుల’ ఆప్షన్ కింద ఏళ్ల తరబడి విధులకు రానున్నట్టు తేలింది. అయితే ఇలా సుదీర్ఘకాలం సెలవుల్లో ఉన్న వారికి స్వచ్ఛంద పదవీ విరమణ సదుపాయం ఉంది. చాలా మంది రిటైర్మెంట్ తీసుకోకుండా సెలవులను ఉపయోగించుకున్నారట. టీచర్ల గైర్హాజరు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడటం వల్ల రిటైర్మెంట్ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.