Posani Krishna Murali: నంది అవార్డులపై పోసాని సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?
Posani Krishna Murali: సినీ నటుడు.. దర్శకుడు పోసాని కృష్ణమురళి నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డుల విషయంలో.. కులం, మతం అనేవి చూసి ఇచ్చేవారని అన్నారు. గతంలో నంది అవార్డులు అలాగే ఇచ్చేవారని అన్నారు.
Posani Krishna Murali: సినీ నటుడు.. దర్శకుడు పోసాని కృష్ణమురళి నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డుల విషయంలో.. కులం, మతం అనేవి చూసి ఇచ్చేవారని అన్నారు.
గతంలో నంది అవార్డులు అలాగే ఇచ్చేవారని అన్నారు.
సంచలన వ్యాఖ్యలు.. (Posani Krishna Murali)
సినీ నటుడు.. దర్శకుడు పోసాని కృష్ణమురళి నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డుల విషయంలో.. కులం, మతం అనేవి చూసి ఇచ్చేవారని అన్నారు. గతంలో నంది అవార్డులు అలాగే ఇచ్చేవారని అన్నారు. పోసాని కృష్ణమురళి వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో.. అవార్డుల పంపకాలు ఇలాగే జరిగేవని ఆరోపించారు.
ఏపీ ఫైబర్నెట్ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
వైసీపీ పాలనలో.. ఏపీ ఫైబర్ నెట్ లో సినిమాలు చూసే అవకాశం కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని అన్నారు.
ఎన్టీఆర్ తో నటించిన టెంపర్ సినిమాలో నటనకు గాను.. అవార్డు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
తప్పని పరిస్థితుల్లో.. ఎలాంటి ఆప్షన్ లేని సమయంలో తనకు ఆ అవార్డు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఆ అవార్డుల కమిటీ జాబితాలో 11మంది ఒకే వర్గానికి చెందినవారు ఉన్నారని తెలిపారు. దీంతో ఆ అవార్డును తనకు వద్దని చెప్పినట్లు మీడియాకు తెలిపారు.
అవార్డులు అనేవి నటనలో ప్రతిభ ఆధారంగానే ఇవ్వాలని సూచించారు.
పోసాని వ్యాఖ్యలపై స్పందన..
నంది అవార్డులపై పోసాని చేసిన వ్యాఖ్యల పట్ల.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ స్పందించింది. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని.. కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ అన్నారు. ఆయన పార్టీ పరంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. కానీ నంది అవార్డుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. జాతీయ అవార్డుల విషయంలోనూ కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహజం. పాత్రలో దమ్ముంటే.. అవార్డులు వాటంతట అవే వస్తాయని రిప్లై ఇచ్చారు.