KKR vs RCB: కోల్ కతా భారీ స్కోర్.. ఆర్సీబీ లక్ష్యం 205 పరుగులు
KKR vs RCB: ఐపీఎల్ లో మరో పోరుకు సమయం ఆసన్నమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ.. బౌలింగ్ ఎంచుకుంది.
KKR vs RCB: కోల్ కతా భారీ స్కోర్ సాధించింది. మెుదట్లో తడబడిన ఆ జట్టు.. తర్వాత పుంజుకుంది. ముఖ్యంగా శార్ధుల్ ఠాకూర్ ఆర్సీబీకి చుక్కలు చూపించాడు. 29 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. రింకు సింగ్ కూడా బ్యాటింగ్ లో రాణించాడు. దీంతో నిర్ణిత ఓవర్లలో కోల్ కతా 204 పరుగులు చేసింది.
ఆర్సీబీ బౌలింగ్ లో డెవిడ్ విల్లీ, కరణ్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, బ్రాస్ వెల్, హర్షల్ పటెల్ తలో వికెట్ తీశారు.