Published On:

Accident in West Bengal: వెస్ట్ బెంగాల్ రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

Accident in West Bengal: వెస్ట్ బెంగాల్ రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

Nine peoples killed in accident: వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పురులియా జిల్లాలో నేషనల్ హైవే 18 మీద బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లారీని బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతులు పురులియా జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నామ్షోల్ ప్రాంతంలో ఘటన జరిగింది. అదాబనా గ్రామం నుంచి జార్ఖండ్ లోని తిలాయితాండ్ కు వెళ్లారు. తిరిగి వస్తుండగా బొలెరో అదుపుతప్పి లారీని వేగంగా ఢీకొంది. మృతులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రమాద వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే అతివేగమే ప్రమదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.