Last Updated:

Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో ఎదురు కాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి

Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. సుక్మ జిల్లాలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి.

Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో ఎదురు కాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి

Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. అదును చూసి పోలీసులపై కాల్పులకు దిగుతున్నారు. నేడు పోలీసులకు- మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

ఎదురు కాల్పులు.. ముగ్గురు పోలీసుల మృతి  (Chattisgarh)

మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా సుక్మ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉండే ఛత్తీస్ గఢ్ లో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. సుక్మా జిల్లాలోని కుందేడ్‌లో ఈ భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర భద్రతా దళాలకు.. మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం వేళ డీఆర్‌జీ బృందాలు.. సుక్మా జిల్లా పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోలింగ్ కోసం బయలుదేరాయి. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా బయలుదేరిన భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. జాగర్‌గుండ కుందేడ్ ప్రాంతంలో.. వీరికి మావోస్టులు తారసపడ్డారు. వెంటనే ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

 

మృతుల్లో డీఆర్ జీ జవాన్లు, ఏఎస్ఐ స్థాయి అధికారులు

ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇందులో డీఆర్ జీ జవాన్లు.. ఏఎస్‌ఐ స్థాయి అధికారి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏఎస్ఐ రామురామ్ నాగ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ కుంజం జోగా, సైనిక్ వంజం భీమా ఈ కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు అధికారికంగా ధ్రువికరీంచారు. కాల్పులకు పాల్పడిన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు.. ముగ్గురు మరణించినట్లు పోలీసులు తెలపగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరణాలపై అధికారులు ప్రకటించాల్సి ఉంది. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసుల కూంబింగ్ కొనసాగిస్తున్నారు. అప్రమత్తమైన మావోయిస్టులు అదును చూసి పోలీసులపై కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు సైతం గాయాలైనట్లు తెలుస్తోంది.

 

ఛత్తీస్ ఘడ్ లో పోలీసులు- మావోయిస్టుల మధ్య గతవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వారం రోజుల్లో ఇది రెండో దాడి. మావోయిస్టుల ఏరివేతకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంటుంది. నక్సల్స్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చత్తీస్ గఢ్ లో పోలీసులు ఎప్పటికప్పుడు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల నుంచి ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారు.