Diamond of India: డైమండ్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ ఎదగడం ఖాయం : సీఎం కేసీఆర్
CM Kcr : తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి దిక్సూచిగా ఉన్నాయని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈరోజు జగిత్యాల జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా తెరాస పార్టీ కార్యాలయాన్ని
Telangana News: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి దిక్సూచిగా ఉన్నాయని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈరోజు జగిత్యాల జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా తెరాస పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. 27 ఎకరాల్లో 510 కోట్ల ఖర్చుతో ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగ్‌ను నిర్మిస్తున్నారు. అనంతరం జగిత్యాలలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు. ఇలాగే కృషిచేస్తే తెలంగాణ డైమాండ్ ఆఫ్ ఇండియాగా ఎదగడం ఖాయమన్నారు. ఇప్పటికే అనేక రంగాల్లోనే దేశంలో నెంబర్1 గా నిలిచామని సీఎం కేసీఆర్ వివరించారు. జగిత్యాల కలెక్టరేట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 14వ కలెక్టరేట్ ను నిర్మించామన్నారు. అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. 33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
దేశంలో అనేక విషయాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాల జీడీపీల కంటే మెరుగైన జీడీపీ సాధించాం. పంటల ఉత్పత్తి, తలసరి విద్యుత్ వినియోగంతో పాటు అనేక రంగాల్లో మెుదటి స్థానంలో ఉన్నామన్నారు. ఇదంతా ఏ ఒక్క కేసీఆర్ తోనో, సీఎస్ తోనో, మంత్రుల తోనో సాధ్యం కాలేదు. మనందరి సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. అద్భుతమైన పురోగతి సాధించి… దేశానికి ఆదర్శంగా నిలిచాం అని కేసీఆర్ వ్యాఖ్యనించారు.
2016 రూపాయల వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నామని, రైతుబంధు ఇస్తున్నామని తెలిపారు. అయితే, రైతు బంధు అందరికీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారని.. రాష్ట్రంలో 93 శాతం రైతులకు భూమి 5 ఎకరాలలోపే ఉందని… 25 ఎకరాలకు మించి ఉన్న రైతులు 0.25 మాత్రమే ఉన్నారని వివరించారు. గ్రామాల్లోనే ధాన్యాన్ని కొనే ఒకే రాష్ట్రం తెలంగాణ అంటూ కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.