Covid-19: కోవిడ్ రెండవ డోస్ బూస్టర్ డోస్ మధ్య వ్యవధి ఆరునెలలే
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ల నిర్వహణకు ఉన్న గ్యాప్‌ను కేంద్రం బుధవారం 9 నెలలు లేదా 39 వారాల నుంచి 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గించింది. 18-59 సంవత్సరాల మధ్య ఉన్న లబ్దిదారులందరికీ 2వ డోస్ ఇచ్చిన తేదీ నుండి 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత బూస్టర్‌ను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
New Delhi: కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ల నిర్వహణకు ఉన్న గ్యాప్‌ను కేంద్రం బుధవారం 9 నెలలు లేదా 39 వారాల నుంచి 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గించింది. 18-59 సంవత్సరాల మధ్య ఉన్న లబ్దిదారులందరికీ 2వ డోస్ ఇచ్చిన తేదీ నుండి 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత బూస్టర్‌ను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ యొక్క స్టాండింగ్ టెక్నికల్ సబ్ కమిటీ 2వ డోస్ మరియు ముందు జాగ్రత్త మోతాదు మధ్య వ్యవధిని ఇప్పటికే ఉన్న 9 నెలలు లేదా 39 వారాల నుండి సవరించాలని సిఫార్సు చేసింది. అందువల్ల 18-59 సంవత్సరాల నుండి లబ్ధిదారులందరికీ బూస్టర్ డోస్ ను ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో 2వ డోస్ ఇచ్చిన తేదీ నుండి 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న లబ్ధిదారులతో పాటు హెల్త్ కేర్ వర్కర్స్ (హెచ్‌సిడబ్ల్యులు) మరియు ఫ్రంట్ లైన్ వర్కర్స్ (ఎఫ్‌ఎల్‌డబ్ల్యులు) కు రెండవడోస్ తీసుకున్న 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వబడుతుందని కేంద్రం తెలిపింది.